రాష్ట్రీయం

ప్రజలదే ఈ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘ఎన్నికల్లో ప్రజలదే ఈ అపూర్వ విజయం..’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను సకల జనులూ దీవించారని ఆయన చెప్పారు. మంగళవారం ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఉల్లాసంగా మాట్లాడుతూ ఈ ఫలితాలతో మరింత అనుకువ, విధేయతతో ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అహంకారం అవసరం లేదన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు,
వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, కులాలు, మతాలకు అతీతంగా సకల జనులూ దీవించి తమకు ఈ విజయాన్ని కట్టబెట్టారని ఆయన తెలిపారు. తమకు ఈ గొప్ప విజయం అందించిన వారందరికీ నమస్కరిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో జరిగిని ఎన్నికల ఫలితాలు యాదవ్ దేశానికి మార్గాన్ని చూపించాయని ఆయన తెలిపారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో తాను కాళేశ్వరం అన్నానని, చంద్రబాబు శనేశ్వరం అన్నారని, ప్రజలు కాళేశ్వరం కోరుకున్నారని ఆయన తెలిపారు. పోడు భూముల కోసం వీలైనంత త్వరగా, పేదలు సంతోషంగా ఉన్నారని, పేదవారు కోరుకున్న విధంగా కుమ్మరి, కమ్మరి కుదుటపడాలని అన్నారు.
ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం..
నిరుద్యోగుల్లో కొంత బాధ ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. వారు నిరాశకు గురి కావద్దని, వేగంగా ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఇక ఇఎన్‌టీ పరీక్షలు
ప్రజలందరి ఆరోగ్యం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. కేసీఆర్ కిట్స్, కంటి వెలుగు వంటివి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. త్వరలో ఇఎన్‌టీ పరీక్షలు చేయిస్తామన్నారు. ఆ తర్వాత దంత పరీక్షలు చేయిస్తామని, ఫ్యాథాలాజికల్ బృందాలూ ప్రజల వద్దకు వెళతాయని ఆయన తెలిపారు.
మైనారిటీలను కడపులో పెట్టుకుంటా
మైనారిటీలను కడుపులో పెట్టుకుంటానని ఆయన చెప్పారు. దళితులకు భద్రత కల్పిస్తామన్నారు. దీని కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని వేశామని ఆయన తెలిపారు. పేదరికం ఎవరినైనా దహించి వేస్తుందన్నారు. దళిత దేవత అని ఒకాయన పుస్తకం రాశారని ఆయన చెప్పారు. రెడ్డిలు, ఇతర ఉన్నత వర్గాల్లోనూ పేదలు ఉన్నారని, అందుకే రెడ్డిల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
సింగిల్ రీ-పోలింగ్ లేదు
ఎన్నికల్లో సింగిల్ రీ-పోలింగ్ జరగలేదని కేసీఆర్ తెలిపారు. చెంప దెబ్బ, బద్మాషీలు, దొమీలు లేవని ఆయన చెప్పారు. ఇందుకు ఇసికి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశామని ఆయన తెలిపారు. మీడియా కూడా ముఖ్య భూమిక పోషించిందని ఆయన చెప్పారు.
ప్రజల ఏజెంట్లం
గులాంగిరీ చేయం
తాము ప్రజల ఏజెంట్లమనీ, ఇతరులకు గులాంగిరి చేయమని ఆయన అన్నారు. నాలుగు పార్టీలు కలిసి ఏకమై భుజాలు చరుచుకోవడం కాదు, ప్రజలను కలవాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొదింపజేయాలని ఆయన చెప్పారు. తమకు పూర్తిగా పాజిటివ్ ఓట్లు పడ్డాయని తెలిపారు. తమ పార్టీ వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించడంతో ఇంకో 16, 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని, ఖమ్మంలో వేరే పార్టీ చంపలేదని, ఒకరి కత్తి మరొకరికి తగిలి నష్టపోయారని ఆయన వివరించారు. అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి ఓడిపోవడం పట్ల కేసీఆర్ బాధను వ్యక్తం చేశారు.
సెక్రటేరియట్ వెళ్ళలేదన్నారు
ఒక విలేఖరి ఏదో ప్రశ్నించబోగా, కేసీఆర్ ప్రతిస్పందిస్తూ మీకు ఎందుకంత తొందర, నన్ను సెక్రటేరియట్ పంపించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనను కొంత మంది ప్యాలెస్‌లో ఉంటున్నానని, గోల్కండ కోటలో ఉంటున్నానని, సెక్రటేరియట్ వెళ్ళడం లేదన్నారు కదా? అని అన్నారు.
చిత్రం..