రాష్ట్రీయం

కొంపముంచిన లగడపాటి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ సర్వే మాటెలా ఉన్నా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వే తమ కొంపముంచిందని ఏపీ వ్యాప్తంగా బెట్టింగ్‌రాయుళ్లు వాపోతున్నారు. లగడపాటి సర్వే తుది ఫలితాలకు చేరువలో ఉంటుందనే భావనతో తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందనే ధీమాతో పెద్దఎత్తున పందేలు జరిగాయి. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రజా కూటమికి 70 సీట్లు వస్తాయని, అధికారం ఖాయమని లగడపాటి మీడియా ఎదుట బాహాటంగా చెప్పటంతో నమ్ముకున్న పందెపు రాయుళ్లు నట్టేట మునిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కూటమి తరుపున టీడీపీ నేతలు అధికమొత్తంలో పందేలకు దిగితే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు టీఆర్‌ఎస్ తరుపున పెట్టుబడి పెట్టారని స్వయాన ఓ అధికారపార్టీ ముఖ్యనేత వ్యాఖ్యానించటం గమనార్హం. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోనే 20 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు మీద పందాలు సాగాయి. విచిత్రమేమంటే కొందరు రాజధానిలో ప్లాట్లను పణంగా పెట్టిమరీ పందాలు కాశారనే ప్రచారం జరుగుతోంది. భూములు, ఇతర స్థిర, చరాస్తులు, నగదు పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, స్లిప్‌లు, నోటరీ ఒప్పందాలు కూడా జరిగినట్లు తెలిసింది. అభ్యర్థుల ఖర్చు మాటెలా ఉన్నా లెక్కుకు మించి పందెం కాసి నష్టపోయిన బాధితులు లగడపాటికి శాపనార్థాలు పెడుతున్నారు.