రాష్ట్రీయం

వీవీ పాట్స్‌ను లెక్కించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈవీఎంలతో పాటు వివీపాట్స్‌ను కూడా లెక్కించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. తమకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలకు అనుసంధానం చేసిన వీవీపాట్స్‌ను (ఓటర్ వెరిఫికేషన్ పాట్స్) లెక్కపెట్టిన తర్వాతనే ఫలితాలను ప్రకటించాలన్న తమ డిమాండ్‌కు ఎన్నికల కమిషన్ అంగీకరించక పోవడానికిగల అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు. తాము వ్యక్తం చేసిన అభ్యంతరంపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ తరఫున లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల ఫలితాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మొదటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కంటే ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. అప్పటి నుంచి ఎన్నికల ఫలితాల దాకా టీఆర్‌ఎస్‌కు ఎన్నికల కమిషన్ సహకరిస్తూనే ఉందని విమర్శించారు. ఈవీఎంల బటన్‌పై నొక్కిన విధంగానే ఓటు పడిందా? లేదా? అని నిర్దారించుకోవడానికే ఎన్నికల కమిషన్ వివీపాట్స్‌ను ప్రవేశపెట్టిందన్నారు. మరి తమ డిమాండ్ మేరకు వివీపాట్స్‌ను ఎందుకు లెక్కపెట్టడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్క వివీపాట్స్‌ను మాత్రమే లెక్కిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పడం కూడా తమకు అనుమానంగా ఉందన్నారు. అలాగైతే తాము సూచించిన బూతుల వివీపాట్స్‌ను మాత్రమే లెక్కించాలని కోరినా ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదన్నారు. అలాంటప్పుడు ఎవరి కోసం వివీపాట్స్‌ను ఏర్పాటు చేసినట్టు అని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిర్ణయించిన వివీపాట్స్‌ను కాకుండా తాము సూచించిన వాటిని లెక్కపెట్టకపోవడం వల్ల తమ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టు అయిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వీవీపాట్స్‌కు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్‌లో ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో తమ పార్టీకి చెందిన అభ్యర్థి లక్ష్మణ్ కేవలం 440 ఓట్లతో ఓడిపోయినట్టు ప్రకటించారన్నారు. రెండు లక్షల ఓట్లలో 440 స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో వివీపాట్స్‌ను లెక్కించాలని తమ అభ్యర్థి డిమాండ్ చేసినా ఎన్నికల అధికారులు తిరస్కరించారన్నారు. గద్వాలలో కూడా తమ అభ్యర్థి డికె అరుణ వివీపాట్స్‌ను లెక్కించాలని కోరినా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ అంశంపై తమ పార్టీ కేంద్ర ఎన్నికల అధికారిని కూడా తమ పార్టీ కలువనుందని ఆయన తెలిపారు.
చిత్రం..ఫలితాలు వెలువడిన తరువాత మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి