రాష్ట్రీయం

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన తరువాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 18 న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు. ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, వీఎస్వో మనోహర్, పేష్కార్ రమేష్ బాబు, ఏఈఓ అశోక్, ఏవీఎస్వోలు కూర్మారావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆనందనిలయంపై ఉన్న
విమాన వెంకటేశ్వరస్వామిని శుద్ధి చేస్తున్న సిబ్బంది