ఆంధ్రప్రదేశ్‌

కిం..కర్తవ్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: తెలంగాణ ఎన్నికల్లో పరాజయం పొందిన నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏమిటనే విషయమై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో కూటమి గెలుపుపై గంపెడాశలు పెంచుకున్న పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్ ఘన విజయంతో ఒకింత నైరాశ్యంలో ఉన్నారు. తెలంగాణ ఫలితాలు ఆంధ్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ నుంచి వైదొలగిన అనంతరం ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసి బీజేపీ వ్యతిరేక పవనాలు వీచేలా చేయటంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతకృత్యులైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా మారిన తెలంగాణ ఎన్నికల్లో పరాజయం ఒకింత కుంగదీస్తోంది. ఫలితాలకు కొద్దిగంటల ముందే జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పక్షాల నేతలతో బీజేపీ యేతర ప్రత్యామ్నాయంపై ఐక్యఫ్రంట్ తొలి సమావేశం నిర్వహించిన సంగతి విదితమే. అయితే ఫలితాల అనంతరం జాతీయ ఫ్రంట్ ఏర్పాటులో సమీకరణలు మారతాయనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ లేదా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలే చక్రం తిప్పుతున్నాయని, తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు కేసీఆర్ మద్దతిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మరికొందరు నేతలు తెలంగాణ తరహాలో అభివృద్ధే ఇక్కడా తారకమంత్రం కాగలదనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో సైతం ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ తరహాలో ఒంటరిగా పోటీచేసి గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా విజయం సాధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఏపీలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని పోల్చుకుంటే తెలంగాణలో పదిశాతం మాత్రమే అమలు జరిగాయని వాదిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని, పోలవరం నిర్మాణం, ఉపాధి కల్పన, వెయ్యి రూపాయల పింఛను పథకం, డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధితో పాటు చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి, ప్రధానంగా నిరుద్యోగ భృతి కల్పించింది తమ ప్రభుత్వమే అనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని భవిష్యత్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్, వైసీపీ, జనసేన పార్టీల ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.