రాష్ట్రీయం

కోస్తాకు వాయు‘గండం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వాయుగుండంగా మారి కోస్తా ఆంధ్రాపై ప్రభావం చూపనుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ప్రభావం పలు జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకూ కోస్తా జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం ఉంటుందని బుధవారం వెల్లడించారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలోని తొమ్మిది జిల్లాలతో పాటు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడొచ్చని, జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఈ వాయుగుండం ప్రభావంతో గాలులు గంటలకు 70 నుండి 100
కిలోమీటర్లు వేగంతో వీస్తాయని, అల్పపీడనం మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నామని తెలిపిన ఆర్టీజీఎస్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి: పంటలు జాగ్రత్త
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) అధికారులు సూచించారు. కోత దశలో ఉన్న పంటలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను ముందుగానే యంత్రాల సహాయంతో కోసి సురక్షితంగా ఉంచుకోవాలన్నారు. కోతలు పూర్తయి ఉంటే సురక్షిత ప్రాంతాలలో పంట దిగుబడులను ఉంచాలన్నారు. పంటలకు ఎరువులు పిచికారీ మందులను వర్షాలు తగ్గిన తరువాత మాత్రమే ఉపయోగించాలన్నారు.