రాష్ట్రీయం

ఎందుకు ఓడాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తప్పకుండా అధికారంలోకి వస్తుందనుకున్న ప్రజాకూటమి ఘోర పరాజయానికి కారణం ఏమిటి? తప్పిదం ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేయకుండా కూటమి కట్టడమా? ప్రచారానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రావడమా? ఎలక్షన్ మేనేజిమెంట్‌లో వైఫల్యమా? లేక టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఓటింగా? వివిధ కోణాల్లో కాంగ్రెస్ పార్టీ విశే్లషించుకుంటోంది. రాజకీయ పండితులేమో స్వీయ రాజకీయ అస్తితత్వం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి ప్రచారం వల్లనేనని తేల్చేశారు. అయితే ఇందులో నిజమెంత? అనే కోణంలో కూడా కాంగ్రెస్ విశే్లషిస్తోంది. ప్రాథమికంగా మాత్రం ప్రజాకూటమిలో పార్టీలకు కేటాయించిన సీట్ల వల్ల ఏ మాత్రం ప్రయోజనం కలగలేదని పార్టీ నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఓటమిపై కాంగ్రెస్ పార్టీలో పోస్టుమార్టం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు ఓట్లు 56,68,06 కాగా, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో కలిసి పోటీ చేయగా వచ్చిన ఓట్లు 58,83,111 మాత్రమే. ఒంటరిగా పోటీ చేసిన దానికంటే కూటమి కట్టడం వల్ల కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్లు కేవలం 2,15,044 మాత్రమే కావడంతో కూటమి వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదని సీనియర్ నేత ఒకరు విశే్లషించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కాలేదా? లేక ఆ పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంకు తగ్గిందా? అని విశే్లషిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు రాగా ఈసారి ఎన్నికల్లో ఇది 28.4 శాతానికి స్వల్పంగా పెరిగింది. పెరిగిన ఓట్ల శాతం 3.2 శాతం మాత్రమే. కాంగ్రెస్‌కు స్వల్పంగా ఓట్ల శాతం పెరిగినా టీడీపీకి తగ్గిన ఓటింగ్ శాతం వల్ల నష్టం జరిగి ఉంటుందని లెక్కలేస్తున్నారు. టీడీపీకి 2014 ఎన్నికల్లో
14.7 శాతం ఓట్లు రాగా అది ఈ సారి 11.2 శాతానికి తగ్గి 3.5 శాతానికి పడిపోయింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన సీట్లు మినహాయించి మిగతా అన్ని సీట్లకు పోటీ చేసి, ఈ సారి 13 సీట్లకే పరిమితం కావడం వల్లనే ఓట్ల శాతం తగ్గిందన్న మరో వాదన ఉంది. ఎలా ఉన్నా టీడీపీ వల్ల పొత్తు పెట్టుకోవడం వల్ల ఒరిగిందేమి లేదన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికలు, ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లు, పెరిగినా, తగ్గిన ఓటింగ్ శాతాన్ని పక్కన పెడితే ప్రచారానికి చంద్రబాబు నాయుడు రావడం వల్ల కూడా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగిందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పట్టుమని ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే, రాష్ట్రం ఏర్పాటుకు అనేక అడ్డంకులు సృష్టించిన పార్టీగా, రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ ఏర్పడకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని, ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా చంద్రబాబుతో ప్రచారం చేయించడం మరో తప్పిదంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు విశే్లషిస్తున్నారు. పైగా కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని బరిలోకి దింపడం వల్ల మళ్లీ తెలంగాణలో ఆంధ్రనేతలు, నందమూరి కుటుంబం రాజకీయ ప్రవేశం జరుగుతుందని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం కూడా కాంగ్రెస్‌కు నష్టం కలిగించిందన్న అభిప్రాయం కూడా విశే్లషణలో వ్యక్తమైంది. అలాగే తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ పార్టీకి ఓటు బ్యాంక్ అంటూ ప్రత్యేకంగా లేకపోవడం, దీనికి కేటాయించిన అన్ని సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం వల్ల ఆ పార్టీతో కలిగిన లాభం కంటే వాటిల్లిన నష్టమే ఎక్కువని కాంగ్రెస్ భావిస్తోంది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో కాంగ్రెస్‌కు పట్టున్నప్పటికీ పోటీ చేయకపోవడం కనీసం టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే సీపీఐకి కేటాయించిన స్థానాల్లో కూడా కాంగ్రెస్ పోటీ చేసి ఉంటే అక్కడ పరిస్థితి కూడా మరోలాగా ఉండేదని కాంగ్రెస్ మధనపడుతోంది.