రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా పంచమీ తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 12: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పట్టపుదేవేరి శ్రీ పద్మావతి అమ్మవా రు అవతరించిన తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన బుధవారం నిర్వహించిన పంచమీతీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. ఈసందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చి న సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఖజానాలోని ఆభరణాలలో రెండింటిని అ మ్మవారికి కానుకగా అందించారు. ఇందు లో 1.74 కేజీల బంగారు కాసుల దండ, 776 గ్రాముల బంగారు కుంభహారతి ఉన్నా యి. అనంతరం పంచమీతీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు వేడుకగా స్న పన తిరుమంజనం నిర్వహించారు. మధ్యా హ్నం 11.42 గంటలకు మకర లగ్నంలో పంచమీతీర్థం ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు దాదాపు లక్ష మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సిం ఘాల్, చంద్రగిరి, తిరుపతి ఎమ్మెల్యేలు చె విరెడ్డి భాస్కర్‌రెడ్డి, సుగుణమ్మ, టీటీడీ జే ఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈ ఓ ఝాన్సీరాణి, పాల్గొన్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య అమ్మవారు తిరుచ్చి వాహనంపై ఊరేగారు. అనంతరం రాత్రి 9.30 నుంచి 10.30 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది.
నేడు పుష్పయాగం
గురువారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.

చిత్రాలు.. .పంచమీ తీర్ధం సందర్భంగా చక్రత్తాళ్వార్‌తో పుష్కరిణిలో స్నానమాచరిస్తున్న అశేష భక్తజనం