ఆంధ్రప్రదేశ్‌

జనం వచ్చారు.. సీట్లే రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ బహిరంగ సభలకు జనం తండోపతండాలుగా వచ్చారని, అయితే ఆశించిన ఫలితాలు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఒక్క సీటు దక్కకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని ముఖ్దూం భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాల పరిశీలిస్తే..ప్రజాఫ్రంట్ నేతల మధ్య సమన్వయం కొరవడినట్టే కనిపిస్తోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిందే’అని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ ప్రజాఫ్రంట్‌లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి రాకపోవడం కూడా ఓ కారణమని ఆయన చెప్పారు. సీపీఐ మేనిఫెస్టో లో పొందుపరిచిన నిరుద్యోగ భృతి, పెన్షన్‌ను కేసీఆర్ కాపీ కొట్టారని చాడ ఆరోపించారు. వాటి కి అదనంగా రూ. 16 జతచేసి టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందన్నారు. కేసీఆర్ సభలు వెలవెల పోయాయని అయినా టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వాస్తవాలు పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 50 శాతం వ్యతిరేకత స్పష్టంగా కన్పించిందని సీపీఐ నేత స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోయారని, అది కేసీఆర్‌కే సాధ్యమైందని చాడ తెలిపారు.