రాష్ట్రీయం

మనకిది పరీక్షాకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న రోజులన్నీ అన్ని విధాలా పరీక్షా కాలమేనని, రాష్ట్రానికి నష్టం కలిగించే వ్యతిరేక శక్తులను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో మాట్లాడుతూ ధనిక రాష్ట్రాలు సైతం అందించని రీతిలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, కేంద్రంపై బొబ్బిలిపులిలా పోరాటం చేపడతానన్నారు. తనకు ఎటువంటి భయం లేదని.. గౌరవం కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం పనిచేస్తున్నానని, వారికి అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధంగా ఉంటానని, రాష్ట్భ్రావృద్ధి
విషయంలో లాలుచీ రాజీకాయాలు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే బీజేపీ వ్యతిరేక కూటమికి శ్రీకారం చుట్టామని, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం పోరాడుతుంటే కేంద్రం అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఢిల్లీ కంటే మిన్నగా అమరావతిని నిర్మిస్తామని చెప్పిన కేంద్రం నిధులు మంజూరు చేయకాకుండా ఎగ్గొడుతోందన్నారు. సీబీఐ అవినితీలో కూరుకుపోయిందని, సాక్షాత్తు ప్రధాన మంత్రే అవినితీపరులని ప్రోత్సహిస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకనే ఆర్‌బీఐ గవర్నర్ రాజీనామా చేశారన్నారు. కేవలం తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ అని, జగన్, కేసీఆర్, పవన్‌లకు మోదీ అంటే భయమని, వారిని మచ్చిక చేసుకొని మనపైకి ఉసి గొలుపుతున్నారన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపి ఓటమి వెనుక టీడీపీ కృషి ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను ఆధారంగా చేసుకొని తమపై బురద జల్లుతున్నారని, కేసీఆర్ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. కేంద్రం నమ్మించి మోసం చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. గౌరవప్రదంగా ఉండాలనుకుంటున్నాని, అందుకే సంయవనం పాటిస్తున్నానన్నారు. బీజేపీ దాడిని ఎదుర్కోవడానికే కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తున్నామని, కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది కూడా టీడీపీ నుంచే అన్న విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని, తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటే పవన్, జగన్‌లకు ఎమిటి నష్టమని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను, ఏపీకి రూ.35వేల ఎకరాల భూమి రైతులు ఉదారంగా అందించారన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు కేటాయించే విషయంలో నమ్మకద్రోహం చేశారని, పోలవరం పనుల కోసం ఇప్పటి వరకూ రూ.3,500 కోట్లు ఖర్చు చేసి, పట్టిసీమను పూర్తిచేయడంతో కరవును కూడా ఎదుర్కొనే స్థితి వచ్చింది. అవినితీ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుటామన్నారు. రాష్ట్భ్రావృద్ధి విషయంలో ప్రతిపక్ష పార్టీ సహకరించి ఉంటే మనకు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావన్నారు. విభజన హమీల కోసం నిజనిర్ధారణ కమిటీ వేసిన జనసేన అధినేత పవన్ ఏమి సాధించారని ప్రశ్నించారు. ఏపీకి రూ.75వేల కోట్లు అవసరమని ప్రకటించిన పవన్ నేడు ఆయా నిధుల కోసం ఎందుకు అడగటం లేదున్నారు. విభజన హమీలపై పోరాటాలు చేస్తుంటే ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీతో దాడులు చేయడం సరికాదున్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు, కుతాంత్రాలు చేసినా, ఆర్ధిక అసమానతలు తగ్గించి, పేదలకు చేయూతనిచ్చే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. మీరంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఉంటే ఎవరెన్ని కుట్రలు చేసినా మనకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్మేలు పాల్గొన్నారు.
చిత్రం..విశాఖ జిల్లా భీమునిపట్నం ఆత్మీయ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు