రాష్ట్రీయం

కేసీఆర్ అనే నేను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1.25 నిమిషాలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కేసీఆర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంతో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం కూర్పు కసరత్తు ముగిసాక మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సీఎం కార్యాలయ వర్గాల సమాచారం. ఇలా ఉండగా తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడం కేసీఆర్‌కు ఇది రెండోసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జూన్ 2, 2014లో మొదటిసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అయితే తొమ్మిది నెలల ముందు సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. శాసనసభ రద్దు తర్వాత మూడు నెలలపాటు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ మధ్య కాలంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసి తిరిగి టీఆర్‌ఎస్ రెండోసారి కూడా అధికార పీఠాన్ని దక్కించుకుంది. కొత్త సభ్యులు శాసనసభా పక్షం సమావేశంలో కేసీఆర్‌ను సభా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయడంతో గవర్నర్ నరసింహన్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మహమూద్ అలీ ఒక్కర్నే లాంఛనప్రాయంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శాసనసభ సభ్యుల సంఖ్య ప్రకారం రాష్ట్రంలో సీఎంతో కలిపి మొత్తం 18 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. మరో 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఉండగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీలు, మాజీ మంత్రులు, ఎన్నికైన కొత్త శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, పార్టీ నేతలు హాజరయ్యారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయం నుంచి వచ్చిన అర్చకులు సీఎం కేసీఆర్‌కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

రాజ్‌భవన్‌లో గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కే. చంద్రశేఖరరావు. చిత్రంలో గవర్నర్ నరసింహన్ తదితరులు