రాష్ట్రీయం

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 2019 జనవరి 10 వరకే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడికావడంతో కోర్టు ఆదేశాల మేరకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని బీసిలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సాంకేతికపరమైన సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించి మరో 30-40 రోజుల సమయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. పంచాయతీల్లో రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకూడదని ఒకవైపు హైకోర్టు, మరోవైపు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే ఎస్‌సీలకు 20 శాతం, ఎస్‌టీలకు ఆరుశాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో 24 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయిస్తేనే 2019 ఫిబ్రవరిలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది. 2013 ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మొత్తం 60 శాతం స్థానాలను ఎస్‌సీ, ఎస్‌టీ, బీసిలకు రిజర్వ్ చేశారు. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడవగా కేవలం 2013 పంచాయతీల ఎన్నికలకే 60 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తర్వాత జరిగే ఎన్నికలకు రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని సుప్రీంకోర్టు అప్పట్లోనే స్పష్టం
చేసింది. తాజాగా ఇచ్చిన ఆదేశాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో బీసీ సంఘాలు, బీసీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి వారిని 24 శాతం రిజర్వేషన్లకే ఒప్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గంలో బీసీ శాఖ మంత్రిని నియమించిన తర్వాత ఈ బాధ్యత సదరు మంత్రికి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మంత్రివర్గం ఏర్పాటు మరో పదిరోజుల్లో పూర్తయితే, ఆ తర్వాత బీసీ సంక్షేమ మంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు వీలుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏయే గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలను, వార్డు సభ్యుల స్థానాలను ఎస్‌సీలకు, ఎస్‌టీలకు, బీసీలకు రిజర్వ్ చేస్తారో ఈ నెల చివరిలోగా నిర్ణయించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తే, అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది.
40 రోజుల సమయం
ప్రభుత్వం నుండి రిజర్వేషన్ల జాబితా తమకు అందిన 40 రోజుల్లోగా ఎన్నికలు పూర్తిచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఇప్పటికే అధికారిక అంశాలపై జిల్లా యంత్రాంగాలతో చర్చలు జరిపారు. దాంతో ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.