రాష్ట్రీయం

బాలికలను చదివిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బాలికలను చదివించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి నిర్మల పేర్కొన్నారు. కేంద్ర సమాచార శాఖ రీజనల్ అవుట్‌రీచ్ విభాగం బేటీ బచావో- బేటీ పఢావో పేరిట రెండు రోజుల శిక్షణ కార్యశాలను ప్రారంభించింది. కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి గానూ అవసరమైన విధి విధానాలపై ప్రైవేటు రిజిస్టర్డు బృందాలకు అవగాహన కల్పించేందుకు ఈ వర్కుషాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో క్షేత్ర ప్రచార విభాగం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యంగా బేటీ బచావో- బేటీ పఢావో ద్వారా బాలికలను కాపాడుకుందాం- బాలికలను చదివిద్దాం , బ్రూణ హత్యలపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేద్దాం అని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ప్రజలు గుర్తించేలా వివిధ కళారూపాల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. తెలంగాణ లోని నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బాలురు కంటే బాలికల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని, పరిస్థితి చక్కదిద్దాలని ఆమె అన్నారు.
మహిళా శిశు సంక్షేమ విభాగం జాయింట్ డైరెక్టర్ కుసుమ కుమారి మాట్లాడుతూ పాఠశాలల్లో వసతులు పెంచి బాలికలు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవలసి ఉందని అన్నారు. మహిళా, శిశు సంక్షేమ విభాగానికి చెందిన మరో అధికారి ప్రగతి మాట్లాడుతూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్రప్రభుత్వం నేరుగా 25 లక్షల రూపాయిలు అందిస్తోందని అన్నారు. పత్రికా సమాచార కార్యాలయం అదనపు డీజీ టీవీకే రెడ్డి మాట్లాడుతూ బాలికల- బాలుర నిష్పత్తి పెరగకపోతే భవిష్యత్ ఆందోళనకరంగా ఉంటుందని అన్నారు.
ప్రజల దృక్పథంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. అందుకు కళారూపాల ప్రదర్శన సమయంలో బాలికల సంఖ్య పెరగడానికి సోదాహరంగా ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. జిల్లా పారామెడికల్ అధికారి గురుప్రకాష్, ఇతర అధిరులు పాల్గొన్నారు.