రాష్ట్రీయం

కూటమి హేమాహేమీల ఓటమికి కారణాలు ఏమిటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: తెలంగాణలో ప్రజా కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలనే ఉద్దేశంతో విపక్షాలన్ని ఏకమై పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కూటమి నాయకులు కలిసిపోయిన కార్యకర్తలు కలవక పోవడంతో భారీ నష్టాన్ని చవిచూశారు. పైగా కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీ, టీజేఎస్ పొత్తు ఉమ్మడి జిల్లాలో కలిసిరాలేదు. టీజే ఎస్‌కు, టీడీపీకి కేటాయించిన స్ధానాల్లో వారికి కార్యకర్తలు లేకపోవడమే ఇబ్బందిగా మారింది. కూటమిలో బలమైన కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికి వారు మిత్ర పక్షాలకు సహకరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా కూటమి అభ్యర్ధులు ఘోర పరాభవాన్ని చవిచూడడం వెనుక టికెట్ల కేటాయింపు లోపాలు కూడా ఉన్నాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. టికెట్ల కేటాయింపుకు తోడు చివిరి వరకు అభ్యర్ధుల ఎంపికను నాన్చుతూ రావడం కూటమి అభ్యర్ధుల కొంపముంచిందని చెపుతున్నారు. వ్యూహంలో భాగంగానే టికెట్ల కేటాయింపు జాప్యం చేస్తున్నామని అధిష్టానం ఒక వైపు చెప్పినప్పటికి ఈ టికెట్ల కేటాయింపు జాప్యమే అభ్యర్ధుల ఓటమికి ప్రధాన కారణం అని అంటున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు పోటీలో ఉన్నప్పటికి ఓడి పోవడానికి గల కారణాలు ఎమిటి అనేది అంతుచిక్కని పశ్న. జనగామలో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పరకాలలో మాజీ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డిలు ఓటమి చెందారు. అయితే పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కేటాయింపులో జాప్యం చేయడం, పొత్తులో భాగంగా టీజే ఎస్‌కు ఇస్తామని చెప్పడంతో పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గాన్ని వదిలి డీల్లీలో మకాం వేయడం వల్లె ఆయన ఓటమి చెందారు.
ఇక కొండా సురేఖ తన సిట్టింగ్ స్ధానం అయిన వరంగల్ తూర్పును వదిలి పరకాలకు పోవడంతో అప్పుడు ఆమె పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు. దీనికి తోడు పరకాలలో టీ ఆర్ ఎస్ అభ్యర్ధి డబ్బు పంపకాలలో ముందునట్లు చెపుతున్నారు. తూర్పులోనే కొండా సురేఖ పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేదని అంటున్నారు. ఇక పరకాలలో గతంలో అక్కడ గెలిచిన టీడీపీకి గాని లేదా గతంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి టికెట్ ఇచ్చినట్లైతే గెలిచి ఉండేవారని అంటున్నారు. ఇక వరంగల్ పశ్చిమ నుండి మహాకూటమి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రేవూరి ప్రకాష్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గెలవడంతో పాటు నర్సంపేట స్ధానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు ఉండేవని అంటున్నారు. నర్సంపేటలో రేవూరి ప్రకాష్‌రెడ్డి బలమైన నాయకుడు. ఆయన వరంగల్ పశ్చిమ రావాలంటే టీడీపీ క్యాడర్ అంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోవడం నర్సంపేట కాంగ్రెస్ సిట్టింగ్ స్దానాన్ని కోల్పోయింది. ఇక ఉమ్మడి జిల్లాలో నాలుగు స్ధానాలలో టికెట్ల కేటాయింపులో జరిగిన లోపాలే కారణం అని తెలుస్తుంది.