రాష్ట్రీయం

మీరు అప్పగిస్తారా? జోక్యం చేసుకోవాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్‌స్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అం దజేసిన నివేదికపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృషణ్,జస్టిస్ ఎస్‌వీ భట్‌తో కూడిన ధర్మాసనం వైఎస్ జగన్ పిటిషన్లపై విచారణ జరిపింది. జగన్‌పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు నివేదికలోని అంశాలు పేలవంగా ఉన్నాయంటూ కేంద్ర హోమ్‌శాఖను బెంచ్ తప్పుపట్టింది. మరోసారి పూర్తిస్థాయిలో దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జగన్ కేసును జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్‌ఐఏ)కి అప్పగించడానికి అభ్యంతరమేమిటీ? నిబంధనలు అంగీకరించడం లేదా? అని న్యాయమూర్తులు నిలదీశారు. కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించకపోతే కోర్టు జోక్యం చేసుకుంటుంది, తామే ఆ పనిచేస్తాం అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఎన్‌ఐఏకు తామే అప్పగించాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 21వ తేదీ నాటికి పూర్తి వివరాలు సీల్డ్‌కవర్‌లో ఉంచి నివేదించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించే విషయమై పరిశీలన జరుగుతోందని కేంద్రం హోమ్‌శాఖ కోర్టుకు తెలిపింది.