రాష్ట్రీయం

దూసుకొస్తున్న పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అమరావతి, డిసెంబర్ 14: బంగాళాఖాతంలో శ్రీహరికోటకు 1140 కిలోమీటర్లు, చెన్నైకి 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా మారింది. ఇది బలపడి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరంవైపు దూసుకొస్తోంది. రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తుపాను గమనా న్ని నిరంతరం పరిశీలన జరుపుతోంది. తుపాను మధ్యకోస్తా జిల్లాల్లో ఈనెల 17న తీరం దాటే అవకాశాలు ఉన్నాయని ఆర్టీజీఎస్ అంచనా వేసిం ది. దీంతో కోస్తా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. పెథాయ్ తుపాను శుక్రవారం నాటికి మ చిలీపట్నం తీరానికి 1200 కిలోమీటర్ల దూ రం లో కేంద్రీకృతమైంది. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పెథాయ్ తుపాను ప్రభావం చూపనుంది. తుపాను కారణంగా సముద్రంలో జాలర్ల చేపలవేటను నిషేధించారు. తీరంలోని ఓడరేవులు, హార్బర్లలో ఒకటో నెంబర్ ప్రమాద సూచిక ఎగురవేశారు. తుపాను తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగసిపడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున తీరప్రాంత ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తుపాను విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు కోస్తా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రాత్రిళ్లు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి ఉంచాలని సూచించారు. తుపాను కారణంగా విశాఖపట్నం పోర్టు, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్న, వాడరేవు హార్బర్లలో ఒకటో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి తీరంలో అలజడి మొదలైంది. తీరంలో మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తుపాను నష్టం నివారణకు ముందస్తు సన్నద్ధత ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుపాను గమనం, తీవ్రత, అంచనాలు, యంత్రాంగం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి ఆర్టీజీఎస్ సీఈఒ అహ్మద్‌బాబు ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు ప్రబుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను కారణంగా మత్స్యకారులు పడవలను హార్బర్లలో నిలిపివేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను వెనక్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ నుంచి 48వేల మంది మత్స్యకారులకు నిరంతరం తుపాను హెచ్చరికలు పంపుతున్నారు. కోస్తా తీరంలో దాదాపు అన్ని పడవలను నిలిపివేశారు. చేపలవేటలో ఉన్న 133 పడవలు, మత్స్యకారులు తీరానికి తిరుగు ప్రయాణమైనట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కోస్తా ప్రాంతంలో వరి కోతలు పూర్తయ్యే దశలో తుపాను ప్రమాదంపై రైతాంగంలో ఆందోళన మొదలైంది. వరి కోతలు, నూర్పిళ్ల సమయం కావటంతో తుపాను వల్ల ధాన్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరం చేయాలని నిర్ణయించింది. తుపాను నేపథ్యంలో రేయింబవళ్లూ కేంద్రాలను తెరచి ఉంచి కొనుగోళ్లు జరపాలని పౌరసరఫరాలశాఖ ఆదేశించింది. రైతులు తమ ధాన్యాన్ని ఏ సమయంలో తీసుకొచ్చినా కొనుగోళ్లు జరపాలని సూచించింది. రైతులకు అవసరమైన వరికోత యంత్రాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. తుపాను ప్రభావిత లోతట్టు ప్రాంతల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రక్షిత షెల్టర్లు, ప్రభుత్వ పాఠశాలల భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఈదురుగాలుల కారణంగా కూలిన చెట్లను అప్పటికప్పుడు తొలగించేందుకు ట్రీ కట్టర్స్ యంత్రాలను సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.