రాష్ట్రీయం

సీమకు ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: రాయలసీమ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు వెల్లడించారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో ఏర్పాటుకానున్న రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ పరిశ్రమకు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి రిమోట్ ద్వారా ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుద్దేశించి ప్రసంగించారు. గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ పరిశ్రమను 14నెలల్లో పూర్తిచేసి 2020 ఫిబ్రవరి నాటికి ప్రారంభించాలని యాజమాన్యానికి నిర్దేశించారు. రాష్ట్రానికి రూ 15,73,172 కోట్ల పెట్టుబడి తెచ్చే 2632 పరిశ్రమలను రప్పించగలిగామన్నారు. అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసి ఆరోపణలు చేయాలని విపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో 33,03,671 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. ఇందులో రూ. 6,30,457 కోట్ల పెట్టుబడులతో 1695 పరిశ్రమలు ఉత్పత్తి నుంచి అనుమతుల వరకు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిలో 795 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయని తెలిపారు. మరో 299 యూనిట్లు భూ కేటాయింపుల దశలో ఉండగా, మరో 638 పరిశ్రమలు డీపీఆర్ దశలో ఉన్నాయని వివరించారు. భూ కేటాయింపుల దశ వరకు చేరిన పరిశ్రమల ద్వారా 10,23,782 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ప్రాథమిక దశల్లో ఉన్న పరిశ్రమల ద్వారా 22,79,889 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రారంభించిన పరిశ్రమలలో రెండున్నర లక్షల మందికి పైగా ఉద్యోగాలు దక్కాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఏం ఒరిగిందని విమర్శించే విపక్షానికి
ఇదే సమాధానమన్నారు. తమ ప్రభుత్వం ఏదీ పునాదిరాళ్లకే పరిమితం చేయటం లేదని, ప్రారంభోత్సవ తేదీలు కూడా ఖరారుచేసి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయిస్తున్నట్టు చెప్పారు. కొత్త
రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేందుకు నాలుగేళ్లుగా కాలుకు బలపం కట్టుకుని దేశదేశాలు తిరిగానని గుర్తుచేశారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామికీకరణ ఊపందుకుంటోందని రానున్న రోజులు రాయలసీమవే అని ఘంటాపథంగా చెప్పారు. చిత్తూరులో శ్రీసిటీ, అనంతలో ఆటోమొబైల్ పరిశ్రమలు, నగరిలో టెక్స్‌టైల్ పార్క్, తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్, కర్నూలులో సీడ్‌పార్క్, సోలార్‌పార్క్, ఇప్పుడు సిమెంట్ హబ్ వచ్చాయని వివరించారు. త్వరలో కర్నూలు జిల్లాలో ఫార్మాపార్క్, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో రాయలసీమ జాతకమే మారుతుందని సీఎం ఉద్ఘాటించారు. ఉద్యానవన పంటల్లో రాయలసీమ దేశానికే తలమానికంగా ఉందన్నారు. కియా రాకతో ఆటోమొబైల్ రంగంలో అనంతపురం జిల్లాకు రూ 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అభివృద్ధికి కర్నూలు జిల్లా చిరునామా కాగలదన్నారు. జిల్లాలో 65 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 36 యూనిట్లు ఉత్పిత్తిదశకు చేరుకున్నాయని గత నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క జిల్లాలో రూ 1,03,137 కోట్ల పెట్టుబడులను ఆకర్షించ గలిగామన్నారు. మొత్తం 88 పరిశ్రమలు ఈ జిల్లాలో ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చితే 81వేల 184 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పరిశ్రమ రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉందని, అదే చెడగొట్టటం సులభమని వ్యాఖ్యానించారు. కొంతమంది అభివృద్ధి నిరోధకులు పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరక్కుండా అడ్డుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వీరివల్ల భావితరాలు నష్టపోతాయన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలి.. రైతుల ఆదాయం రెట్టింపు కావాలి.. ప్రజలంతా సంతోషంగా ఉండాలి.. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేది తమ అంతిమలక్ష్యంగా చెప్పారు. కర్నూలు జిల్లాకు గతంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదో ఆలోచిస్తే నాయకుల స్వార్థం అర్థమవుతుందని విమర్శించారు.
త్వరలో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సీడ్ పార్క్ ద్వారా కర్నూలు జిల్లా నుంచి ప్రపంచానికి విత్తనాలు అందించబోతున్నామని ప్రకటించారు. కొలిమిగుండ్ల ప్రాంతం సిమెంట్ హబ్‌గా రూపుదిద్దుకోవటం ఖాయమన్నారు. కర్నూలు జిల్లాకు త్వరలో ఫార్మాపార్క్ మంజూరవుతోందని తెలిపారు. దీని ద్వారా ఔషధ రంగానికి ఈ ప్రాంతం చిరునామాగా మారుతుందని అభిలషించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామని ఇందులో ఇప్పటికే 31 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ఏపీలో పారిశ్రామికవేత్తలు ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. రాజధాని నిర్మించేందుకు డబ్బులులేవు.. సొంతంగా నిధులు సమకూర్చుకునే మార్గాలను అనే్వషిస్తున్నాం..కేంద్రం సహకరించటం లేదు. వంచనకు గురిచేసిందని ధ్వజమెత్తారు. రూ 50వేల కోట్లతో రాజధాని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయక కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్భ్రావృద్ధిని ఓ యజ్ఞంలా చేపడితే కొంతమంది అదేపనిగా అడ్డుపడాలని చూస్తున్నారని వారిని నమ్మితే మళ్లీ చీకటిరోజులు తెస్తారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా మన హక్కని చెప్తూ నాడు హోదాకు మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు మోదీ చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని వైకాపా అధినేత జగన్, జనసేన అధినేత పవన్ ఆకాశానికెత్తటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తొలుత రూ 15 వందల కోట్లతో నెలకొల్పుతున్న రామ్‌కో గ్రీన్‌ఫీల్డ్ సిమెంట్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో ఇప్పటికే రామ్‌కో ఆధ్వర్యంలో పరిశ్రమలు విస్తరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి సాయిప్రసాద్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.