రాష్ట్రీయం

విద్యుత్‌పై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: పెథాయ్ తుపానుకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతినకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానే కొత్తవి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈనెల 17న తుపాను తీరం దాటే సమయం వరకు సరఫరా, పంపిణీలో ఎలాంటి నష్టాలు జరగకుండా చూడాలన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆయా విద్యుత్ రంగ సంస్థల అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లైన్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు తగినంత
సిబ్బందిని తుపాను ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్రేక్ డౌన్‌లు, లైన్ నష్టాలు స్తంభాలు కూలిపోయే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు ఎప్పటికప్పుడు అవసరమైన యంత్రసామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదమున్నందున విద్యుత్ లైన్లపై చెట్లు విరిగిపడి ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి సరఫరాను సత్వరమే పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, విజిలెన్స్, మానిటరింగ్ సెల్ విభాగంతో పాటు సిబ్బందిని తగినంత తుపాను ప్రభావిత జిల్లాలకు తక్షణమే పంపించాలని ఆదేశించారు. ఇఇలు, డిఇలు, ఎఇలు సబ్‌స్టేషన్‌లు, 33, 11 కెవి లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్‌ల సందర్భంగా విద్యుత్ శాఖ అందించిన సేవల స్ఫూర్తితో తిరిగి పెథాయి తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. సుమారు 50 నుంచి 70 వేల వరకు స్తంభాలను సిద్ధంచేయాలన్నారు. ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా పునరుద్దరణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దని కోరారు. అవసరమైన మేరకు జనరేటర్లను సమకూర్చుకుని మరమ్మతులు పూర్తిచేయాలన్నారు. తుఫాన్ సమయాల్లో ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా కాకుండా జాగ్రత్తలు వహించాలని, కర్నూలు, కడప, అనంపూర్ జిల్లాల నుంచి అవసరమైన సిబ్బంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎస్‌పిడిసిఎల్, ఇపిడిసిఎల్ సిఎండిలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర స్పందిస్తూ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్‌లు దెబ్బతింటే అందుకు తగ్గ సామగ్రి, ఉద్యోగులు, కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ట్రాన్స్‌కో జెఎండిలు దినేష్ పర్చూరి, ఉమాపతి, ఆయా జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.