రాష్ట్రీయం

ఎమ్మెల్యేగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 15: తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన వైకాపా నేత డాక్టర్ తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో కేసులు, ఇతర సమాచారానికి సంబంధించి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందున మడకశిర ఎమ్మెల్యే టీ.ఈరన్నను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మడకశిర ఎమ్మెల్యేగా తనను ప్రకటించాలని గత ఎన్నికల్లో పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన వైకాపా నేత తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి విజయరాజుకు అందచేసినట్టు తెలిపారు. కోర్టు తీర్పు అమలు చేయాలని, సాధ్యమైనంత త్వరగా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరినట్టు తిప్పేస్వామి చెప్పారు.

చిత్రం..కోర్టు తీర్పు ప్రతులను అసెంబ్లీ కార్యదర్శికి అందచేస్తున్న తిప్పేస్వామి తదితరులు