రాష్ట్రీయం

ఏపీలో బలమైన పార్టీకి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీకి మద్దతునిస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ప్రకటించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానలిచ్చారు. ఆంధ్ర రాజకీయాల్లో కల్పించుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ లోగడ చెప్పిన అంశాన్ని ఒక విలేఖరి ప్రస్తావిస్తూ, ఎవరికి మద్దతునిస్తారని ప్రశ్నించగా,
కేటీఆర్ స్పందిస్తూ ‘ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇస్తాం’ అని బదులిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పకుండా పరోక్షంగా బలమైన ప్రాంతీయ పార్టీ అని చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు భారత దేశం అభివృద్ధి కోసం పని చేయాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు దేశం పార్టీ కోసం ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. ప్రజాబలం లేని ప్రజాకూటమిని రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేని చంద్రబాబు ప్రజలపై రుద్దాలని యత్నించారని ఆయన విమర్శించారు. ప్రజా చైతన్యం ముందు ఏ శక్తి నిలవదని ఈ ఎన్నికలతో స్పష్టమైందన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే అక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదట, కానీ తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలవగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం చేసే వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని అన్నారు. మరి కొంత మంది ఉత్సాహంగా హంగ్ వస్తుందని అన్నారని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం టీఆర్‌ఎస్‌కు సంపూర్ణమైన మెజారిటీ లభిస్తుందని మొదటి నుంచీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కీలకంగా ఉండాలి కదా? అని ప్రశ్నించగా, ఆ పాత్రను మీడియా పోషించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. వార్తలు నిష్పాక్షికంగా ఉండాలని ఆయన అన్నారు. పత్రికలు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. తాను రాహుల్‌ను, ప్రధానిని తిడితే దానిని ప్రచురించరాదని, ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించరాదని ఆయన కోరారు. అదేవిధంగా ఎవరైనా కేసీఆర్‌ను తిట్టినా చూపించవద్దని, ప్రచురించవద్దని కోరారు.