రాష్ట్రీయం

తెరాస అంటే... ‘తిరుగులేని రాజకీయ శక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెసంబర్ 15: టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితినే కాదు ‘తెలంగాణ రాజకీయ శక్తి’ అని ఆ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కే. తారక రామారావుస్పష్టం చేశారు. లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటైన మీట్ ద ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రెస్‌క్లబ్‌కు వస్తానని చెప్పాను. అలాగే మీడియా మందుకు రానని అన్నాను’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఇటీవల ఎన్నికల యుద్ధంలో విజయం సాధించి సంతోషంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చిరస్మరణీయంగా ఉండేలా చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు తాను శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. తాను జీవించి ఉన్నంత వరకూ ఈ తీర్పును మరచిపోలేనని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తమ గుండెల్లో ఎంతగా పదిలంగా ఉంచుకున్నారో ఈ ఫలితాలతో స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు టీఆర్‌ఎస్ రక్షణ కవచం ఉంటిదని ఆయన చెప్పారు. స్వీయ రాజకీయమే శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెబుతుండే వారని ఆయన గుర్తు చేశారు. సిట్టింగ్ ప్రభుత్వం సానుకూల ఓట్లతో విజయం సాధించడం అసాధారణ విషయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 98 లక్షల ఓట్లు లభించాయని, తమ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య 42 లక్షల ఓట్ల తేడా ఉందని ఆయన చెప్పారు. బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతు అవుతాయని తాను ఎన్నికలకు ముందు చెప్పానని, చివరకు ఫలితాల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆయన తెలిపారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా మరింత పటిష్టవంతం చేసేందుకు కేసీఆర్ తనకు ఈ బాధ్యత అప్పగించారని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వందేళ్ల పాటు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను పరోక్షంగా 8 ఎన్నికల్లో పని చేశానని, నాలుగు ఎన్నికల్లో విజయం సాధించానని కేటీఆర్ చెప్పారు. పంచాయతీరాజ్, పార్లమెంటు, మున్సిపల్, జిల్లా, సొసైటీ, మండల పరిషత్ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొవడాని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ సునాయసంగా 16 సీట్లను కైవసం చేసుకుంటుందని కేటీఆర్ ధీమాగా చెప్పారు. ఇప్పటికే 14 స్థానాలు తమ పార్టీ గెలుపొందిందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. లోక్‌సభలో ఒక్కోసారి ఒక్క సీటు కూడా కీలకమే అవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్-బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నందున, అది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే 15 లోక్‌సభ సీట్లలో తమకు స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్నదని, ఒక్క ఖమ్మం లోక్‌సభ స్థానంలోనే అధిక్యత లేదని, అక్కడ దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డుల వంటి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

చిత్రం..టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్