రాష్ట్రీయం

సత్వర న్యాయం.. తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 15: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సమాచార వ్యవస్థతో కోర్టులు, పోలీస్ శాఖల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే సంబంధాలను వేగవంతం చేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మదన్ బి లోకూర్ సూచించారు. నూతన పైలెట్ ప్రాజెక్టుతో కోర్టు, పోలీస్ శాఖల మధ్య పనిభారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి సమాచార పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవస్థను తొలి ప్రయత్నంగా తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని అభినందించారు.
పోలీస్ స్టేషన్లను న్యాయ వ్యవస్థతో అనుసంధానం చేస్తూ నూతనంగా రూపొందించిన ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టంను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కోర్టు, పోలీస్ విభాగాల అనుసంధానం చేయడం ద్వారా త్వరితగతిన కోర్టులో కేసులను పరిష్కరించడంతోపాటు బాధితులకు స్వత్వరమే న్యాయం కల్పించడం కోసం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో నూతనంగా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) రూపొందించబడిందని అన్నారు. ప్రస్తుతం ఈ ఐసీజేఎస్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన కేసులను క్షణాల్లో స్ధానిక కోర్టుకు అనుసంధానం చేయడంతో పాటు, కేసులకు సంబంధించిన చార్జీషీట్లను సైతం ఐసీజేఎస్ ద్వారా కోర్టుకు అందజేసేందుకు వీలుంటుందని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసులు తాలుకా ఎఫ్‌ఐఆర్ కాఫీతో పాటు చార్జిషీట్ల సైతం పోలీస్ సిబ్బంది స్ధానిక కోర్టుకు అందజేయడంతో పాటు సీసీ నెంబర్లు, వారెంట్లు, సమన్లను కూడా కోర్టు ద్వారా పోలీస్ సిబ్బంది పొందాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది దృష్టిలో పెట్టుకొని కోర్టు, పోలీసుల మధ్య అనుసంధానం చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేయడం, పోలీస్ సిబ్బంది వినియోగాన్ని తగ్గించడం కోసం ఈ ఐసీజేఎస్ పరిజ్ఞానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఈ ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే తొలి పోలీస్ స్టేషన్‌గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌ను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ ఫైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తొలిసారిగా సుబేదారి పోలీస్ స్టేషన్ నందు చివరిగా నమోదయైన కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ కమిషనర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా ఐసీజేఎస్ పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకరావడంలో కృషి చేసిన వారందరికి ప్రత్యేకంగా వరంగల్ పోలీసులకు అభినందనలు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో పోలీస్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఇందుకు కారణం కేసులకు సంబంధించి పత్రాలను సమయానికి అందజేయకపోవడంతో పాటు సాక్షులు కోర్టుకు హాజరకాకపోవడంతో కోర్టుల్లో చాలా సంవత్సరాలుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వీటనంటిని అధిగమించేందుకుగాను ఐసీజేఎస్ విధానాన్ని అమలు పర్చడం ద్వారా కేసులను సత్వర్యంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయండంతో పాటు నింధితులకు శిక్షలు పడే అవకాశాల సంఖ్య ఘననీయంగా పెరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఈ వీడియో సమావేశంలో హాజరైయిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి వరంగల్ కమిషనర్ రవీందర్‌తో పాటు సుబేదారి ఇన్స్‌స్పెక్టర్ సదయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో సుబేదారి పోలీసులు దేశంలోని అన్ని పోలీస్ విభాగాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఎసీపీ చంద్రయ్యర, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి మదన్ బి. లోకూర్