రాష్ట్రీయం

స్వేచ్ఛతోనే మార్పు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: పుస్తకాలు భాషా, సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞానం అభివృద్ధి గమనంలో పుస్తకాలు అక్షరసాక్షరాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మెరుగైన సమాజం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, మెరుగైన సమాజం కోసం పాటుపడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శనివారం నాడు ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన 31వ జాతీయ పుస్తక ప్రదర్ళనను ప్రారంభించారు. విప్లవాల కంటే స్వేచ్ఛతోనే సమాజంలో మార్పు సాధ్యమని, పత్రికలు సంచలనాల కోసం పాకులాడకుండా, పత్రికలు వాస్తవాలు చెప్పాలని పేర్కొన్నారు. దేశంలో పఠనాసక్తి పెరిగిందని, బెంగాల్‌లో ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటున్న రీతిన తెలుగులో కూడా పఠనాసక్తిని పెంచాలని పేర్కొన్నారు. ప్రాచీన సంప్రదాయాలను పత్రికలే వెలుగులోకి తేవాలని ఆయన అన్నారు. పుస్తక పఠనం పెరిగి, సమాజం మరింత చైతన్యవంతం కావాలని పేర్కొన్నారు. పుస్తకాలు మన జీవన ప్రమాణాలను పెంచుతామని, పుస్తకాలోత్సవాలు గ్రామ గ్రామానికీ విస్తరించాలని, గ్రంథాలయోద్యమం మళ్లీ రెక్కలు తొడగాలని చెప్పారు. ప్రజల్లో తగ్గుతున్న పఠనాసక్తిని పెంచే మార్గాలను అంతా అనే్వషించాలని అన్నారు. పల్లెకో గ్రంథాలయాలయం , ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని అన్నారు. స్వతహాగా తెలుగు భాషాభిమాని, సాహిత్య పిపాసి , రచయిత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. గ్రంథాలయాలకు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యత ఇస్తారని తాను ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అక్షరానికి భారతీయ సంస్కృతి భగవంతుడితో సమానమైన ప్రాధాన్యత ఇచ్చిందని, పుస్తకాలు మన జీవన ప్రమాణాలను పెంచుతాయని తెలిపారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాళోజీ అన్న మాటలను గుర్తుచేశారు. పుస్తక ప్రదర్ళనలు విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలని చెప్పారు. దేశాభివృద్ధి- విజ్ఞాన శాస్త్ర పురోగతి, యుద్ధం- శాంతి, దేశ పునర్నిర్మాణంలో ఇలా ప్రతి సందర్భంలో పుస్తకాలే సమస్త మానవాళికి అండగా నిలిచాయని, పుస్తక మహోత్సవాల ద్వారా కొత్త పుస్తకాలు, కొత్త రచయితల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఆన్‌లైన్ డిజిటల్ వేదికలు వచ్చినా, ఆచ్చైన అక్షరం విలువ వాడిపోలేదని తెలిపారు. నేషనల్ బుక్ ట్రస్టు 1966లో ముంబైలో తొలి ప్రదర్శన నిర్వహించిన నాటి నుండి పుస్తక పరిశ్రమకు ఆదరణ లభిస్తోందని చెప్పారు. ప్రచురణ అవుతున్న పుస్తకాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన పుస్తకాలు ఎన్ని ప్రచురిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉందని , పుస్తకాల కేవలం కాలక్షేపం కోసం కాదని, అవి ప్రజలను మేల్కొలిపే విధంగా ఉండాలని అన్నారు. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను అందించిందని, తెలుగు భాష సాంస్కతిక, సారస్వత పునరుజ్జీవానికి తెలంగాణ వికాసానికి గ్రంథాలయ ఉద్యమం చేసిన కృషిని ఉప రాష్టప్రతి గుర్తుచేశారు. విద్యార్థులకు మహానీయుల జీవితాలు, చరిత్ర, సంస్కృతిని, విస్తృతమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పరిచయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా విజ్ఞానం , మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం సాకారమవుతాయని చెప్పారు.
సినారె ప్రస్తావన
ఉప రాష్ట్రపతి తన ప్రసంగంలో సినారెను ప్రస్తావించారు. అక్షరం గురించి సినారె చాలా గొప్పగా రాశారని పేర్కొంటూ అక్షరం పరమపదం అన్నారు. అక్షరం అంటే క్షరం లేనిది, అంటే నాశనం లేనిది అని అర్ధమని, అదే అక్షరాలతో మన భాష మొదలవుతుందని, ప్రాచీన కాలం నుండి జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయని, లిపి ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశంలో విజ్ఞాన ఖనులుగా పేరుగాంచిన వేదాలు, వేల సంవత్సరాల పాటు వౌఖిక రూపంలోనే సంరక్షించబడ్డాయని అన్నారు. లిపి కనుగొన్న తర్వాత వౌఖిక రూపంలో ఉన్న విషయాలకు కొందరు మహానీయులు అక్షర రూపం కల్పించారని, దేశాభివృద్ధికి , సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి , యుద్ధ సమయంలో శాంతి సమయంలో దేశ పునర్నిర్మాణ సమయంలో గ్రంథాలు సమస్త మానవాళికీ అండగా నిలిచాయని చెప్పారు. మధురాంతకం రాజారాం గారి గురించి ప్రస్తావిస్తూ పుస్తకం పాఠకుడి తల్లి ఒడి అని అన్నారు. చలసాని ప్రసాదరావు ఒక సందర్భంలో పుస్తకం గురించి చెబుతూ పుస్తకాలు లేని ప్రపంచాన్ని ఊహించలేమని చెప్పారని, తొలి తెలుగు పుస్తకం జర్మన్ దేశంలోని హాతి అనే కుగ్రామంలో బెంజిమన్ షుల్జ్ అనే క్రైస్తవ మతాధికారి ప్రచురించారని గుర్తుచేశారు. పుస్తకాల్లో రాశి ఎంత ? వాసి ఎంత అనేది కూడా చూసుకోవాలని చెప్పారు. విప్లవం అంటే మృత్యువు విలయ తాండవం కాదని, పేనుగుల గుట్టల నుండి విప్లవాలు రావని, ప్రజలను మేల్కొలపాలని, నిజమేదో తెలపాలని దాశరథి చెప్పారని పేర్కొన్న ఉప రాష్ట్రపతి పుస్తకాలను ప్రేమించండి, పుస్తకాలను చదవండి, పెద్ద పెద్ద బహుమతులకు బదులు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వండి అని సూచించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పుస్తక ప్రదర్శన చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి కే చంద్రమోహన్, కోశాధికారి పి రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ ఐఎఎస్ అధికారి బి వెంకటేశం, వివిధ ప్రచురణ కర్తలు, పీఐబీ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి , పలువురు రచయితలు హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందని, ఈ సందర్భంగా ప్రతి రోజు సభలు, సమావేశాలు, సాహిత్య సమాలోచనలు, పుస్తకా విష్కరణ, పిల్లల కోసం బాలల వికాస్ కార్యక్రమాలు ఉంటాయని గౌరీశంకర్ చెప్పారు.

చిత్రం..జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు