రాష్ట్రీయం

సుప్రీం తీర్పు మోదీకి క్లీన్‌చిట్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రాఫెల్ కుంభకోణంలో సుప్రీం కోర్టు తీర్పు మోడీ సర్కార్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు కాదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాలు, 14వ జాతీయ మహాసభలు తిరుపతిలోని ఇందిరా మైదానంలో శనివారం అట్టహాసంగా జరిగాయి. ముందుగా స్థానిక తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద నుంచి ఇందిరామైదానం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాన సమస్యలను పక్కన పెట్టి రామమందిర నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూ మహాసభ వంటి సంస్థలు గో సంరక్షణ పేరుతో మైనార్టీలు, దళితులను హత్య చేస్తున్నారని, మేధావుల వేట కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజ్ఞాని, అహంకారి, నియంతృత్వపాలన సాగిస్తున్న మోదీని గద్దె దించాల్సిన అవసరం ఉందని సురవరం అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే దేశంలో నిరుద్యోగ సమస్య అంతం కాదని, ధరల పెరుగుదల ఆగిపోదని, పేదరికం అంతరించిపోదని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే మతం, రామమందిరం నిర్మాణం అంశాలను తెరపైకి తెస్తున్న బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 8,9 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కార్మికులు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లు అవుతున్నా ఇంటి కోసం, సెంటు భూమి కోసం పోరాటం సాగించాల్సి రావడం బాధాకరమన్నారు.
ప్రధాని న్యాయవ్యవస్థకు గంతలు కట్టారు
* సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయవ్యవస్థకు గంతలు కట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలోని బడా కార్పొరేట్ వ్యాపారులు బ్యాంకులకు రూ. 28 లక్షల కోట్లు ఎగవేశారని, ఆ సొమ్మును వసూలు చేస్తే వ్యవసాయ కార్మికులందరికీ రెండు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, విద్య, వైద్యం ఉచితంగా అందింవచ్చని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులు కూడా సంక్షేమ పథకాల కోసం కాకుండా రాజకీయాలు, పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటం సాగించే స్థాయికి ఎదగాలని అన్నారు.
చిత్రం.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి