రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సంస్థ ఆస్తుల కేసులో పురోగతిపై ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష జరిపారు. వాస్తవ స్థితిపై నివేదికను హైకోర్టుకు సమర్పించటంతో పాటు బాధితుల సమస్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు సూచించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తు.చ.తప్పక అమలు చేయాలని, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలకు వేరే రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదించేలా మాట్లాడే వారి గురించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోర్టు పర్యవేక్షణలో సజావుగా సాగాల్సిన ప్రక్రియకు విఘాతం కల్పించి బాధితులను రెచ్చగొట్టేలా ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. బాధితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అగ్రిగోల్డ్ మోసం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమని, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించటంలో ఏమాత్రం వెనుకాడేది లేదని, బాధితులకు తగిన న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.