రాష్ట్రీయం

ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ ఇంకా కోలుకోకముందే గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారన్న సమాచారం పార్టీని మరింత కలవరపెడుతోంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీతో అంటీముంటనట్టు వ్యవహరిస్తోండటంతో వారు పార్టీ మారుతారన్న సమాచారానికి మరింత బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్టు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఒకవైపు సీఎం సంకేతాలు, మరోవైపు కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళనకు గురవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నట్టు అటు టీఆర్‌ఎస్‌లోనూ, ఇటు కాంగ్రెస్‌లోనూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల సంఖ్య మేరకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. శాసనసభ స్థానాల మొత్తంలో 10 శాతం స్థానాలను గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా (కేబినెట్ ర్యాంక్) దక్కుతుంది. శాసనసభలో 119 స్థానాలు ఉండగా, ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి 12 స్థానాలు గెలుచుకోవాలి. ప్రస్తుతం అంతకంటే ఎక్కువే (19 స్థానాలు) కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. అయితే గెలిచిన వారిలో కొందరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్‌కు సమాచారం అందింది. పైగా ఈ విషయాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ధ్రువీకరించడంతో ప్రతిపక్ష హోదానైనా నిలబెట్టుకోవాలని టీపీసీసీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్‌పీ) సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి సీఎల్‌పీ నేతను ఎన్నుకోవాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరకముందే సీఎల్‌పీ నేత ఎన్నిక జరిగిపోవాలని టీపీసీసీ భావిస్తోంది. రెండు రోజుల్లో శాసనసభ పక్షం సమావేశం జరుగనుందని, తేదీ, సమయం సమాచారం అందగానే హైదరాబాద్‌కు రావాల్సిందిగా టీపీసీసీ ఇప్పటికే ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా సీఎల్‌పి నేతగా భట్టి విక్రమార్క ఎంపికయ్యే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధిష్టానం కూడా భట్టి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. డిప్యూటీ స్పీకర్‌గా గతంలో భట్టి విక్రమార్క పనిచేసిన అనుభవం, సామాజిక వర్గపరంగా ఎస్సీ కావడం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించడం, అన్ని అంశాలపై అవగాహన, విద్యావంతుడు కావడంతో టీపీసీసీలో సీనియర్ నేతలు కూడా అధిష్టానానికి ఈయన పేరునే ప్రతిపాదించినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి మహేశ్వరం నుంచి తాజాగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి పేర్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, అవతల బలమైన పాలకపక్షాన్ని శాసనసభలో ఎదుర్కొగలిగే సత్తా భట్టికే ఉందని పార్టీలో సీనియర్ నేతల అభిప్రాయానికే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.