రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేడు కేటీఆర్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే. తారక రామారావు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం 11.55 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో సహా పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలూ పెద్ద ఎత్తున తరలి రానున్నారు. పార్టీ కార్యాలయం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం పార్టీ నాయకుడు, తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లను పరిశీలించి, కొన్ని సూచనలు చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ చుట్టూ ఉన్న రోడ్లపై వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు.

చిత్రం.. కేటీఆర్