రాష్ట్రీయం

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహా రచనల్లో బిజీ అయ్యారు. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు. 27 పోలింగ్ జరుగుతుంది, 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఉండగా, మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉన్నాయి.
ఇలాఉండగా అన్ని స్థానాలనూ కైవసం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతుండగా, విపక్షాలు ఐక్యమత్యంతో ‘్ఢ’ కొట్టాలన్న ఆలోచన చేస్తున్నాయి. అవసరమైతే తెలుగు దేశం పార్టీతోనూ లోపాయికారి ఒప్పందం పెట్టుకుంటామని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు కొందరు ఇదివరకే ప్రకటించారు. ఈ విషయంపై టిడిపి తొందరపడి నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినందున, ఇప్పుడు ఆ పార్టీతో ఒప్పందమా? అనే తర్జన-్భర్జన పడుతున్నది. అయితే ఈ ఒప్పందం స్థానిక సంస్ధల వరకేనని మరి కొందరు నాయకులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అంతరంగిక అవగాహన తేలిపోతుంది. మహబూబ్‌నగర్‌లోనూ రెండు స్థానాలు ఉన్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మల్లు రవి, దామోదర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌గుప్తా ప్రభృతులు పోటీ పడుతున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన జగదీశ్వర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు ఉన్నాయి.
టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌లు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఖమ్మం సీటు పువ్వాడకే..?
ఇలాఉండగా ఖమ్మం జిల్లాలో సిపిఐ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. పువ్వాడకు మద్దతునివ్వడం ద్వారా మిగతా జిల్లాల్లో మద్దతు కూడగట్టవచ్చన్న ఆలోచనను కాంగ్రెస్ చేస్తున్నది. ఖమ్మంలో పువ్వాడ తనయుడు అజయ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నల్లగొండ లేదా మరో జిల్లాలో సిపిఎంకు ఒక సీటు కేటాయించి, మిత్రత్వం పెంచుకోవాలని, రాబోయే ఎన్నికల నాటికి బలపడాలని కాంగ్రెస్ నేతల భావన.