రాష్ట్రీయం

ప్రజలకు, ప్రభుత్వానికి వారథిగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రజలకు, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారథిగా ఉంటూ, పార్టీ వందేళ్లపాటు అజేయంగా నిలబడేలా గట్టి పునాదులు వేస్తానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చే బాధ్యతను అధినేత కే చంద్రశేఖరరావుతనపై పెట్టారన్నారు. పేదలు, రైతులు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని
వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమైన కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం 11:56 నిమిషాలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు బంజారాహిల్స్ బసవతారకం ఆస్పత్రి చౌరస్తా నుంచి భారీ ఉరేగింపుతో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం తన కోసం ప్రత్యేకంగా కేటాయించిన చాంబర్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విగ్రహానికి పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వెలుపల ఏర్పాటు చేసిన వేదికపై కేటీఆర్ ప్రసంగించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించి తిరిగి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచి నమ్మకాన్ని మరింత పెంచుకునేలా శాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి దృష్టికి కేంద్రీకరించాల్సి ఉండటంతో పార్టీ బాధ్యతలను తనకు అప్పగించారన్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ వందేళ్లపాటు అజేయంగా కొనసాగిలా గట్టి పునాదులు వేస్తామని కేటీఆర్ అన్నారు. ‘మీలో ఒకడిగా, ఒక సోదరునిగా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా’నన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బాధ్యతల స్వీకరణకు నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన జనంతో బసవతారకం ఆస్పత్రి నుంచి అటు తెలంగాణ భవన్ వరకు, ఇటు మినిస్టర్స్ క్వార్టర్స్ వరకు టాఫ్రిక్ గంటన్నర పాటు స్థంభించి పోయింది. తెలంగాణ భవన్‌కు ఇరువైపులా గులాబి జెండలు, ఫ్లెక్సీలతో గులాబిమయంగా మారగా, కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.
చిత్రం..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భాద్యతలు స్వీకరించి పురోహితుని ఆశీర్వచనాలు తీసుకుంటున్న కేటీఆర్