రాష్ట్రీయం

రేపే నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 17: వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ సమాచార ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 19న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ అధ్యక్షతన లాచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్తవ్రేత్తలు ప్రీ కౌంట్‌డౌన్, రిహార్సల్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 2:10గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 26గంటలు కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4:10గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువుగల సమాచార రంగానికి చెందిన జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహం కాలపరిమితి మించిపోవడంతో దాని స్థానంలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎయిర్స్ ఫోర్స్ సమాచార వ్యవస్థకోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగంలో ఇది 35వ ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగ దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం షార్‌కు రానున్నారు.

చిత్రాలు.. జీశాట్-7 ఏ ఉపగ్రహం
*ప్రయోగ వేదిక పై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11