రాష్ట్రీయం

ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: బంగాళఖాతంలో ఏర్పడ్డ పైథాన్ తూపాన్ ప్రభావంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈదురు గాలులకు తోడు మోస్తారు వర్షాలతో ప్రజలు అల్లాడిపోయారు. సోమవారం ఉదయం నుండే ఆకాశం మేఘావృతమై పొగమంచు కమ్మేయడంతో చలి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆదిలాబాద్‌లో గత రెండు రోజులుగా 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఆదిలాబాద్, ఉట్నూరు, బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బేల, జైనథ్, జన్నారం, ఆసిఫాబాద్, నేరడిగొండ మండలాల్లో ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జనజీవనం స్తంభించిపోగా ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మొక్కుబడిగా పనిచేశాయి.
పంటలపై పైథాన్ దెబ్బ
పైథాన్ తుపాన్ ప్రభావంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు చేజారిపోయాయి. సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోస్తారు వర్షాలకు కంది, పత్తి పంటలు దెబ్బతినగా ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో నాణ్యత కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్ ప్రాంతాల్లో 4వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రెండు రోజుల క్రితం తొమ్మిది మండలాల్లో రైతులు కోలుకోలేని రీతిలో నష్టపోగా మరోసారి పైథాన్ ప్రభావానికి రైతులు పంట నష్టపోయి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

చిత్రం.. గుడిహత్నూర్ శివారులో మంచుదుప్పటితో చెరువును తలపిస్తున్న పంట చేను