రాష్ట్రీయం

ప్రధాని పదవిపై ఆశలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ:: దేశ రాజకీయాల్లో కీలకపాత్రను పోసిస్తున్నప్పటకీ ప్రధాన మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశలేదని, తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో పెథాయ్ తుపాను ప్రభావిత ప్రాంతాలను మంగళవారం మధ్యాహ్నం సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాకినాడ కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. ప్రధాని మంత్రి అవుతారా అని ఒక విలేఖరి
ప్రశ్నించనపుడు తనకు పదవుల కంటే ప్రజాస్వామ్య పరిరక్షణే ముఖ్యమన్నారు. ప్రధాన మంత్రి మోదీ తనకు అందరూ లొంగి ఉండాలనే భావంతో ఉన్నారని, అందుకు టీఆర్‌ఎస్, రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ నాయకులు సరెండర్ అవుతున్నారని ఆరోపించారు. వారికి త్వరలోనే ప్రజలు మంచి బహుమతి (గిఫ్ట్) ఇవ్వబోతున్నారన్నారు. త్వరలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని, ఇందులోభాగంగానే తాజాగా జరిగిన శాసన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించిందన్నారు. తుపాను వస్తుంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు హాజరయ్యారని వచ్చిన విమర్శలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తాను ఆ కార్యక్రమానికి హాజరైనప్పటకీ తన మనస్సు అంతా రాష్ట్రంపైనే ఉందని, ఎక్కడ ఉన్నా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పడు సమర్థవంతంగా పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. అయితే తనను విమర్శిస్తున్న నాయకులు, పక్కనే ఉన్న గ్రామంలో తుపాను వస్తే కనీసం సందర్శనకు కూడా వెళ్లరని ఆరోపించారు. వారు తుపాన్లు వస్తే స్పందించరు, ప్రత్యేక హోదాకోసం అడగరు, విశాఖ రైల్యేజోన్ విషయం ప్రస్తావించరు, పెట్రోకెమికల్ కారిడార్ కోసం మాట్లాడరు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కనీసం అడగనైనా అడగరని, వారా తనను విమర్శించేది అని చంద్రబాబు దుయ్యబట్టారు. తుపాను ప్రభావంతో వాతావరణం అనుకూలంగా లేదంటూ త్వరగా విలేఖరుల సమావేశాన్ని ముగించి రాజధాని అమరావతికి పయనమయ్యారు.