రాష్ట్రీయం

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్11 ప్రయోగం నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. వరుస ఉపగ్రహ ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ఒక సవాల్‌గా తీసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా సమాచార రంగానికి చెందిన 2,250కిలోల బరువుగల జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ప్రయోగ దృష్ట్యా మంగళవారం షార్‌కు చేరుకొన్నారు. ముందుగా ఆయన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి చేరుకొని రాకెట్ విజయం కోసం
ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షార్‌కెళ్లి షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్, శాస్తవ్రేత్తలతో కలిసి ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశం ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా పంపుతున్నారు. ఈ ఉపగ్రహం ఎయిర్స్ పోర్స్ సమాచార వ్యవస్థకు దీని సేవలు ఎంతో ఉపయోగపడుతోంది. ఇది విజయవంతమైతే సమాచార రంగంలో భారత్ మరో ముందడుగులోకి చేరుతోంది. 2013లో ప్రయోగించిన జీశాట్-7 కాలపరిమితి మించడంతో దాని స్థానంలో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని ఇస్రో పంపుతోంది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. భూమి నుంచి రాకెట్ నింగిలోకి ఎగిరినంతరం 19.2నిమిషాల్లో తన మూడు దశలను పూర్తిచేసుకొని జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి చేర్చనుంది. 26గంటలు కౌంట్‌డౌన్ పూర్తిచేసుకొని 0కు చేరగానే జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ బుధవారం సాయంత్రం 4:10గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది.

చిత్రం..ప్రయోగ వేదిక సిద్ధంగా జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్ 11