రాష్ట్రీయం

ఇక పంచాయతీ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ 2019 జనవరి మొదటి వారంలో జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ నాగిరెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నోటిఫికేషన్ జారీ చేసే అంశాన్ని స్పష్టంగా వెల్లడించకపోయినా, జనవరి మొదటి వారంలో జారీ చేసే అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు రిజర్వ్ చేసే సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల రిజర్వేషన్ వివరాలను తమకు ప్రభుత్వం అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నుండి రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఎన్నికల ప్రణాళిక పూర్తి చేసేందుకు 20 రోజుల నుండి 30 రోజుల సమయం అవసరం అవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ జారీ చేస్తారని స్పష్టమవుతోంది. మంగళవారం దాదాపు గంట పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది నియామకం, ఎన్నికల విధులకు ఎంపికైనవారికి శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై చర్చించారు. పార్లమెంట్, శాసనసభలతో పోలిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు క్లిష్టంగా ఉంటాయని నాగిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, దాదాపు 1.30 లక్షలపైగా వార్డు సభ్యుల ఎన్నికల విషయంలో అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. పైగా ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నందువల్ల రాజకీయ పార్టీలకు ఇచ్చే గుర్తులు ఈ ఎన్నికలకు ఉపయోగపడవు. ఈ ఎన్నికల కోసం చిత్ర, విచిత్రమైన గుర్తులు వాడాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వివరించారు.
ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాల సంఖ్య వేలల్లో ఉండటంతో ఎన్నికలను కనీసం మూడుదశల్లో నిర్వహించాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. శాసనసభకు ముందు తాను వివిధ అంశాలపై సమీక్షలు చేశామని, ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని గుర్తుచేశారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, సిబ్బంది శిక్షణకోసం పక్కా ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయాలన్నారు. చివరి క్షణంలో హడావుడి కాకుండా చూసుకోవాలని నాగిరెడ్డి కోరారు.