రాష్ట్రీయం

నేటి నుంచి ‘బతుకమ్మ’ చీరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ ఎన్నికల సమయంలోనే బతుకమ్మ చీరల పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా వాయిదావేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ ప్రారంభించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దశలవారీగా పూర్తి చేయాలన్నారు. జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులను చీరల పంపిణీలో భాగస్వామ్యం చేయాలని కూడా ఆదేశించారు. చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.