రాష్ట్రీయం

ఎమ్మెల్సీ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా ఉంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి నిబంధనల ప్రకారం రెండింటిలో ఏదో పదవికి 15 రోజుల్లో రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కే. స్వామిగౌడ్ ఆమోదించారు. రాజగోపాల్ రెడ్డి లోగడ నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గెజిట్ విడుదల చేసినట్లు మండలి కార్యదర్శి వీ. నరసింహాచార్యులు మంగళవారం తెలిపారు.