రాష్ట్రీయం

పెరగనున్న ఇంజనీరింగ్ రీయింబర్స్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తం పెరుగనుంది. ప్రస్తుతం ఉన్న 35 వేల రూపాయలను 65 వేల రూపాయలకు పెంచనున్నారు. ట్యూషన్ ఫీజు కూడా పెరగనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు పెంపు తదితర అంశాలపై అధ్యయనానికి వేసిన కమిటీ సిఫారసులను రాష్ట్ర మానవ వనరుల శాఖ ఆమోదించడంతో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపు అమలు కానుంది. గత కొంత కాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని, ట్యూషన్ ఫీజును పెంచాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సంఘం ఒత్తిడి తీసుకువస్తోంది. ప్రైవేట్ కళాశాలకు విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులో 35 వేల రూపాయలను మాత్రమే ప్రభుత్వం భరిస్తుండటంతో, మిగిలిన ఫీజును చాలా మంది విద్యార్థులు చెల్లించలేకపోతున్నారని ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఫీజుల భారాన్ని భరించలేక చదువును మధ్యలో మానేసే వారి సంఖ్య ఏపీలో ఎక్కువగా ఉందని ప్రభుత్వానికి వివరించారు. గత ఏడు సంవత్సరాలుగా ట్యూషన్ ఫీజును పెంచలేదని, కానీ పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను 15 వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచడాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సంఘం అభ్యర్థన మేరకు ఫీజుల పెంపు, రీయింబర్స్‌మెంట్ ఫీజు మొత్తం పెంపు తదితర అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫారసులు చేసేందుకు వీలుగా 9 మంది సభ్యులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ తన నివేదికను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇటీవల అందచేసింది. ట్యూషన్ ఫీజును 20 శాతం మేరకు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని 65వేల రూపాయలకు పెంచేందుకు కమిటీ చేసిన సిఫారసులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు కింద ఒక లక్ష రూపాయల నుంచి 1.2 లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం లాంఛనమేనన్న అభిప్రాయాన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే మూడు విద్యా సంవత్సరాల వరకూ ఈ పెంపు వర్తింపచేయనున్నారు.