రాష్ట్రీయం

రాఫెల్ కుంభకోణం ప్రతిపక్షాల సృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 18: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు తీర్పుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. బురదలో పొర్లాడుతూ ఆ బురదను తెల్లగా ఉన్న మోదీకి పూయాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అడిగిన 15 ప్రశ్నలకు కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేటివరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన ప్రతి రూపాయిలోనూ చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రప్రభుత్వ అవినీతికి బంగారు బాతుగా మారిందని అభివర్ణించారు. అధికారం కోసం తన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను మోసగించడం నీరుతాగిన ప్రాయమన్నారు. అగ్రిగోల్డ్ బాదితులకు అండగా బీజేపీ పోరాటం చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు తానా అంటే రాహుల్‌గాంధీ తందానా అంటున్నారన్నారు. జనవరి 6వ తేదీన గుంటూరు సమీపంలోని బుడంపాడులో జరిగే భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, కార్యదర్శి అడపా నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.