రాష్ట్రీయం

ధార్మిక సదస్సులో పాల్గొన్న 42 మంది మఠ, పీఠాధిపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 2: తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సులో 42మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో కంచిలోని శ్రీమఠం మఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి, ఉడిపిలోని పెజావర్ మఠాధిపతి విశే్వశ తీర్థ స్వామీజీ, కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి, తిరుపతిలోని హథీరాంజీ మఠానికి చెందిన మహంత్ అర్జున్‌దాస్ మహరాజ్, తిరుపతిలోని రామకృష్ణ మఠాధిపతి అనుపమానంద, తిరుమలలోని ఆండవన్ మఠాధిపతి రంగరామానుజ మహాదేశికన్ స్వామి, హైదరాబాద్‌లోని కమలానంద భారతీ, కుర్తాళం మఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి, ఉడిపిలోని పాలమర్ మఠం మఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామి, గుంటూరులోని శేషాచల ఆశ్రమం నిర్వికల్పానంద గిరి స్వామీజీ, కాకినాడలోని రాఘవ ఆశ్రమం త్రిదండి రామానుజ జియ్యర్ స్వామీజీ ప్రతినిధి, తాడేపల్లిలోని చైతన్య తపోవనంకు చెందిన మాత శివచైతన్యానంద, గుంటూరులోని జియ్యర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు చెందిన త్రిదండి ఆహోబిల రామానుజ జియ్యర్ స్వామీజీ, శృంగేరిలోని శృంగేరి శంకర మఠం మఠాధిపతి భారతీతీర్థ స్వామీజీ ప్రతినిధి, బెంగళూరులోని శంకర పురానికి చెందిన సత్యాత్మ తీర్థ స్వామీజీ ప్రతినిధి, నెల్లూరులోని సత్యానంద ఆశ్రమంకు చెందిన బ్రహ్మానంద తీర్థ స్వామీజీ, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాస్తమ్రంకు చెందిన విద్యాస్వరూపానంద గిరి స్వామీజీ, విజయవాడలోని పరమాత్మానంద ఆశ్రమానికి చెందిన ఆచార్య శంకరానంద గిరి స్వామీజీ, వెదురుపాకలోని శ్రీ విజయదుర్గ పీఠం పీఠాధిపతి వెదురుపాక స్వామీజీ, తెనాలికి చెందిన నిర్మాలానందగిరి స్వామీజీ, తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన రేవతీ రమణదాస్ ప్రభూ, నెల్లూరులోని చిట్టూరుమూర్‌కు చెందిన విశ్వోన్నతి సనాతన ధర్మ పునరుద్ధరణ కేంద్రం నిర్వాహకులు మహర్షి ఎస్వీ కృష్ణమూర్తి, చెన్నయ్‌లోని అహోబిల మఠంకు చెందిన రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రతినిధి, మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర మఠం మఠాధిపతి సుబుదీంద్ర తీర్థ స్వామీజీ, విజయనగరం జిల్లా రామతీర్థంలోని త్రిదండి కృష్ణ శరణ్య రామానుజ జియ్యర్ స్వామీజీ, సికింద్రాబాద్‌లోని భారతీయ ధర్మ రక్షణ సమాఖ్యకు చెందిన జస్టిస్ భిక్షపతి, హనుమాన్ చౌదరీ, ఏర్పేడులోని వ్యాసాశ్రమానికి చెందిన పరిపూర్ణానంద స్వామీజీ, హైదరాబాదులోని జిహెచ్‌హెచ్‌వి అధ్యక్షుడు వెలగపూడి ప్రకాశరావు, యలమంచలి ప్రసాద్, తిరుపతికి చెందిన గోవింద రామానుజ చిన్న జీయర్ స్వామీజీ, శఠగోప రామానుజ పెద్ద జియ్యర్ స్వామీజీ, గుంటూరుకు చెందిన గౌడేయ మఠం మఠాధిపతి బిఎస్ మునిమహరాజ్, కృష్ణా జిల్లాకు చెందిన వాసుదేవానంద గిరి స్వామీజీ, గన్నవరంలోని చిదానంద ఆశ్రమానికి చెందిన సత్యానంద భారతీ స్వామీజీ, తునికి చెందిన సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, హైదరాబాదులోని పుష్పగిరి మహాసంస్థానంకు చెందిన విద్యాశంకర భారతీస్వామీజీ, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అరవిందరావు, హైదరాబాద్‌కు చెందిన సమరానత ఫౌండేషన్ నిర్వాహకులు, గుంటూరులోని విశ్వ మందిరానికి చెందిన విశ్వయోగి విశ్వంజీ, ఉడిపిలోని అడయార్ మఠం జూనియర్ స్వామీజీ ఈశ త్రియ తీర్థస్వామీజీ, హైదరాబాదులోని హిందూ ధర్మ సంరక్షణ సమితికి చెందిన డి.రామకృష్ణరావు, పెజావర్‌లోని పెజావర్ మఠం జూనియర్ స్వామీజీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీలు పాల్గొన్నారు. వీరితోపాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న మఠ, పీఠాధిపతులు