జాతీయ వార్తలు

ఆగిన రావత్ బలపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్, మార్చి 30: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ డ్రామా బుధవారం మరో మలుపు తిరిగింది. 31న అసెంబ్లీలో బలపరీక్ష నిరూపణ జరపాలంటూ ఏకసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ బల పరీక్షను వాయిదా వేసింది. ద్విసభ్య బెంచ్ తీసుకున్న ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి కొండంత ఊరట కలిగించింది. గురువారం హరీశ్ రావత్ సర్కార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటూ హైకోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి యు.సి.్ధ్యని ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ బర్తరఫ్ అయిన ముఖ్యమంత్రి హరీశ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 6వ విచారణ జరుపుతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.ఎం.జోసెఫ్ సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను విచారించి తుది తీర్పును ఇచ్చే విషయంలో సంబంధిత పక్షాలు అంగీకరించినందుకు ఈ కేసును 6వ తేదీకి వాయిదా వేస్తున్నామని బెంచ్ తెలిపింది. అంటే 7వ తేదీ వరకు బలపరీక్షకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గీ సింగిల్ జడ్జి ఉత్తర్వును తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్టప్రతి ప్రకటనకు సంబంధించి కోర్టులు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడానికి వీలు లేదన్నారు. ఒక పక్క రాష్టప్రతి పాలన అమలులో ఉండగా, అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉన్న సమయంలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. రావత్ ప్రభుత్వం బర్తరఫ్‌కు గురైనందున ఎవరికోసం ఈ బలపరీక్ష నిర్వహిస్తున్నారన్నదానిపై ఏకసభ్య బెంచ్ తీర్పులో స్పష్టత లేదన్నారు. అలాగే అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే మరో రోజులో రావత్ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనున్న సమయంలో హడావిడిగా రాష్టప్రతి పాలన విధించాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది. ఈ నెల 18న అసెంబ్లీలో రాజ్యాంగ వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్టప్రతి పాలన విధించాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అటార్నీ జనరల్ అన్నారు.
అటార్నీ జనరల్ రోహత్‌గీ, అలాగే కాంగ్రెస్ తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి రిట్ పిటిషన్ విషయంలో అవగాహనకు వచ్చారని హైకోర్టు బెంచ్ పేర్కొంది. ఈ రిట్ పిటిషన్ కారణంగానే అనేక అప్పీళ్లకు ఆస్కారం ఏర్పడిందని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్‌ను, అలాగే కేంద్ర పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ అఫిడవిట్‌ను ఏప్రిల్ 4న దాఖలు చేస్తామని అటార్నీ జనరల్ తెలిపారు. అలాగే 24 గంటలలోగా కౌంటర్ అఫిడవిట్లకు రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ రావత్‌ను హైకోర్టు ఆదేశించింది.