ఆంధ్రప్రదేశ్‌

2022 నాటికి గగన్ యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించడానికి గగన్ యాన్ యాత్రకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రణాళికలు రచిస్తోందని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పారు. తద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించే సామర్ధ్యం ఉన్న అగ్రదేశాల సరసన భారత్ కూడా చేరనుందని ఆయన వ్యాఖ్యానించారు. 2022 నాటికల్లా ఈ మిషన్‌ను సాధింగలదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ పథకానికి తాను ఇస్రో చైర్మన్‌గా ఉన్న కాలంలోనే బీజం పడిందని ఆయన వెల్లడించారు. బుధవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం 9023 కోట్లకు డిసెంబర్ 28న ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అంతకంటే ముందే యాత్రకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని, అయితే ఇందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఇపుడు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ కే శివన్ ఈ ప్రాజెక్టుకు చక్కని మార్గదర్శకత్వం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏదైనా సాధించగల సామర్థ్యం ఇస్రోకు ఉందని, దానిన సకాలంలోనే సాధించి చూపుతుందని చెప్పారు. మానవ సహిత యాత్రలో అత్యంత క్లిష్టమైన అంశం అంతరిక్ష యాత్రికులకు శిక్షణ అందించడం, దీని కోసం మాత్రం రష్యా తదితర దేశాలపై కొంత ఆధారపడాల్సి వస్తుంది అని అన్నారు. ముగ్గురు వ్యోమోగాములను తీసుకుని అంతరిక్ష నౌక భూ ఉపరితలం నుండి 400 కిలోమీటర్లు ఎత్తులోని అంతరిక్షంలోకి వెళ్తుందని ఏడు రోజుల పాటు వారిని అంతరిక్షంలో ఉంచేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోందని అన్నారు.