రాష్ట్రీయం

కేసీఆర్ ద్విముఖ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ద్విముఖ వ్యూహంతో దూసుకెళుతున్నారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టవంతం చేయడం, మరోవైపు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించడం. పార్టీకి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అండగా ఉన్నప్పటికీ, ఇకమీదట పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి కమిటీలను పటిష్టవంతం చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, అండగా ఉండడం వంటివి చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు తన కుమారుడు, యువ నాయకుడైన కే.తారక రామారావుకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించి, తాను ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ, వాటిని సమర్థంగా అమలు చేయడం ద్వారా పార్టీని ఇక తిరుగులేని శక్తిగా మార్చాలని ఆయన సంకల్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలులో తప్పిదాలు, లోపభూయిష్టంగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడైనా ప్రజలకు అన్యాయం, అక్రమాలు జరిగినా వాటిని వెంటనే సరి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా తేడా వస్తే, ప్రతిపక్షాలు అదే పనిగా గగ్గోలు పెట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రమాదం ఉన్నందున, అటువంటి అవకాశం, అస్త్రం ప్రతిపక్షాలకు ఇవ్వరాదని ఆయన పట్టుదలగా ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారించారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బ్రహ్మండంగా గెలిపించినందున, ఆ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కోటి ఎకరాలకు సాగు నీరు
ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్న హామీని నిలబెట్టుకోవడానికి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకు తాను స్వయంగా ప్రాజెక్టుల వద్దకు వెళ్ళి పరిశీలన చేస్తే తప్ప అధికారుల్లో కదలిక రాదన్న భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.