రాష్ట్రీయం

‘రిటర్న్ గిఫ్ట్ట్’ తప్పదు బాబూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదని, వచ్చే ఎన్నికల్లో బాబుకు తప్పకుండా టీఆర్‌ఎస్ తరపున రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవటం సహజమేనని వ్యాఖ్యానించారు. నగరానికి సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన తలసాని సోమవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్నారని, అయితే చంద్రబాబు మాత్రం బాహుబలి సెట్టింగ్‌లు చూపిస్తున్నారని తలసాని విమర్శించారు. హైటెక్ సిటీ నిర్మించి హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. బాబు వెంటపడి తాము ఏనాడైనా ఆంధ్రకు వచ్చామా అని ప్రశ్నిస్తూ ఆయన మాత్రం తరచూ తెలంగాణకు వచ్చి తమకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే.. తాము మాత్రం ఇక్కడకు వచ్చి పనిచేయాలా, వద్దా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు తాముకూడా ఇక్కడకు వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నారు. బాబుపై తమకు కోపం లేదంటూ దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలోనే ఆంధ్రకు కూడా రాబోతున్నామని చెప్పారు. తాను ఇక్కడకు వస్తున్నానని తెలిసి దాదాపు లక్ష ఫోన్‌కాల్స్ వచ్చాయని, రాష్ట్ర రాజకీయాల్లో తాను మరింత జోక్యం చేసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు.
తమ గిఫ్ట్ ప్రభావం ఏమేర, ఎంతలా ఉంటుందో త్వరలోనే ప్రజలంతా చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళంలో తలసాని మాట్లాడుతూ ఆంధ్రలో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఐదుగురు శాసనసభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడితో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5వేల కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
చిత్రం..దుర్గమ్మ సన్నిధిలో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు
అమ్మవారి ఆలయ కేలండర్, ప్రసాదం అందజేస్తున్న ఈవో కోటేశ్వరమ్మ