రాష్ట్రీయం

భద్రత కట్టుదిట్టం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కౌన్సిల్ చైర్మన్ కే. స్వామిగౌడ్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం కౌన్సిల్ చైర్మన్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఈ సమావేశంలో మండలి కార్యదర్శి వీ. నరసింహాచార్యులు, డీజీపీ వి. మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీకి కొత్త సభ్యులు ఎన్నికై ప్రమాణం చేసేందుకు వస్తున్నందున, వారి బంధు, మిత్రులు, అనుచరులు వచ్చే అవకాశం ఉన్నందున, విధుల్లో ఉండే పోలీసులు లౌక్యంగా మాట్లాడేలా సూచనలు చేయాలని చైర్మన్ స్వామిగౌడ్ వారికి సూచించారు. ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. 17న 11 గంటలకు అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ఖాన్ సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక కోసం ఆయన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 19న గవర్నర్ నరసింహన్ ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలూ ధన్యవాదాలు చెబుతూ తీర్మానాన్ని ఆమోదిస్తాయి.
చిత్రం..తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై
సోమవారం హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న విధాన మండలి చైర్మన్ స్వామిగౌడ్