రాష్ట్రీయం

దాడికి ప్రోత్సహించింది ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేయాల్సిందిగా ఎవరు ప్రోత్సహించారు?, ఆ కత్తి ఎక్కడిది?, ఎవరు ఇచ్చారు?, విమానాశ్రయం లోపలికి ఎలా తీసుకెళ్ళావు? తదితర ప్రశ్నలతో ఎన్‌ఐఏ పోలీసులు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ రావును ఉక్కిరిబిక్కిరి చేశారు. జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ రావును వారం రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి, సోమవారం ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. నిందితుడు శ్రీనివాస్ రావు తరఫు న్యాయవాది సలీం సమక్షంలో అధికారులు విచారణ నిర్వహించారు. దాడి చేసిన రోజున పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను కేవలం పబ్లిసిటీ కోసమే చేశానని శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే. సోమవారం కూడా శ్రీనివాస్ అదే సమాధానం చెప్పినట్లు సమాచారం. జగన్‌పై దాడి చేయాల్సిందిగా తనను ఎవరూ ప్రోత్సహించలేదని, ఎటువంటి విచారణ చేసినా ఇదే సమాధానం చెబుతానని నిందితుడు అన్నట్లు తెలిసింది. ఇలాఉండగా తదుపరి విచారణ నిమిత్తం మంగళవారం నిందితున్ని వైజాగ్ విమానాశ్రయానికి ఎన్‌ఐఏ అధికారులు తీసుకెళ్ళనున్నారు.