రాష్ట్రీయం

విద్యార్థులకు ఉచితంగా కెరీర్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: విద్యార్థులకు కేరీర్ పరంగా ఉచిత కౌనె్సలింగ్ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా చండీగఢ్ యూనివర్శిటీ ‘లక్ష్య’ కేంద్రాలను ప్రారంభించిందని, అందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ మీడియా హెడ్ ప్రొఫెసర్ ప్రభుదీప్ సింగ్ చెప్పారు. సోమాజీగూడలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించామని, తెలంగాణ విద్యార్థులు అంతా సంవత్సరం పొడవునా కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఉచితంగా పొందవచ్చని అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు యువతరంలో నైపుణ్యాన్ని సంబంధించి పారిశ్రామిక రంగం అంచనాలు కూడా మారుతున్నాయని అన్నారు. పరిశ్రమ అంచనాలకు తగ్గట్టు యువతను సుశిక్షితులను చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాన్నీ తమ విద్యావిధానాన్ని సమూలంగా మార్చుకుంటున్నాయని చెప్పారు. కెరీర్ కౌనె్సలింగ్ సెంటర్‌కు వచ్చే వారికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తామని, తమ జీవితానికి సంబంధించిన కేరీర్‌ను ఎంచుకునే అతికీలకమైన నిర్ణయం తీసుకునేందుకు ఇది విద్యార్థులకు ఎంతో సాయపడుతుందని పేర్కొన్నారు. యువతకు కెరీర్ అవకాశాలను మెరుగుపరిచే కొత్త ప్రోగ్రాంలను రూపొందించడంలో యూనివర్శిటీలు పోటీ పడుతున్నాయని, చండీగఢ్ యూనివర్శిటీలో దాదాపు 250 మంది తెలంగాణ విద్యార్థులు వేర్వేరు వృత్తి విద్యాకోర్సులను చదువుతున్నారని ప్రొఫెసర్ సింగ్ చెప్పారు. ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎన్నో విజయాలను సాధిస్తున్నారని పేర్కొన్నారు. 2018 బ్యాచ్‌లో 50 మంది విద్యార్థులకు గానూ 43 మంది విద్యార్థులవు కేంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్ పొందారని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మోనిక కాగ్నిజంట్, సైటేజ్ సాఫ్ట్‌వేర్‌లో ప్లేస్‌మెంట్ పొందారని అన్నారు. పెద్దపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థిని ఆకృతికి రిలయన్స్ సంస్థ , ఎంఆర్‌ఎఫ్ , నౌక్రీ డాట్ కామ్‌లలో ప్లేస్‌మెంట్ లభించిందని తెలిపారు. పరిశోధనకు సంబంధించిన రంగాల్లో తెలంగాణ విద్యార్థులు సాధించిన విజయాలు ప్రస్తావిస్తూ, ఆస్తమా డయాబెటిక్ రోగుల రక్షణకు మందుల అభివృద్ధి కంపెనీలో అమిత్ వీరపు భాగస్వామిగా ఉన్నారని అన్నారు. యూనివర్శిటీ 800 స్కాలర్‌షిప్‌లను అందజేస్తొందని, దీనికి సంబంధించి అఖిల భారత స్థాయిలో సీయూశాట్ -2019ను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. సీయూశాట్ స్కాలర్‌షిప్ విధానం కింద 2019-20లో 109కి పైగా వృత్తివిద్యా కోర్సుల్లో 100 శాతం స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం విద్యార్థులు ‘్ఫస్టుట్రాక్ డాట్ సీయుసిహెచ్‌డీ డాట్ ఇన్’ అనే వెబ్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదుచేసుకోవాలని అన్నారు. యూనివర్శిటీ, కాలేజీ ప్రొఫెసర్లు చేస్తున్న కృషికి గౌరవంగా వారి పిల్లలకు 10 శాతం అకడమిక్ స్కాలర్‌షిప్‌ను అందించే కొత్తకార్యక్రమాన్ని కూడా ప్రొఫెసర్ సింగ్ ప్రకటించారు.
చిత్రం..చండీగఢ్ వర్శిటీ ఆధ్వర్యంలో లక్ష్య కౌనె్సలింగ్ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్న వర్శిటీ మీడియా
హెడ్ ప్రొఫెసర్ ప్రభుదీప్ సింగ్, జడ్‌ఎం శాంతికుమార్, ఏఎం క్రాంతికుమార్‌రెడ్డి, కౌనె్సలర్ ప్రసన్న