రాష్ట్రీయం

చిరు ధాన్యాల్లో పౌష్ఠికాహార విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: చిరుధాన్యాలైన సజ్జలు, కొర్రలు, రాగులు, ఆరికెలు, సాములు తదితర పంటల ఉత్పత్తికి ప్రభుత్వం తరఫున చేయూత ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘పాత పంటల జాతర’కు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సు, పాత పంటల జాతర జరిగింది. ఈ సందర్భంగా సబర్వాల్ మాట్లాడుతూ డీడీఎస్ ద్వారా దాదాపు 5000 మంది పేద, బలహీనవర్గాలకు చెందిన మహిళలు సంఘటితంగా చిరుధాన్యాలను పండిస్తూ, సామాజిక, ఆర్థిక అసమానతలను దాటి, ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత వైపు అడుగులు వేయడం హర్షణీయమన్నారు. రైతులు తమ ఇష్టమైన పంటలను పండించుకునే హక్కు ఉందని, ప్రభుత్వం తరఫున రైతుబంధు ద్వారా ఆర్థిక సాయం అందుతోందన్నారు. చిరుధాన్యాలు పౌష్టికరమైన ఆహార పదార్థాలని గుర్తు చేశారు. ఎలాంటి పౌష్టిక విలువలు లేని ఆహార పదార్థాలను పట్టణ, నగరాల ప్రజలు వినియోగిస్తున్నారని, చిరు ధాన్యాలను వాడటం మంచిదని సలహా ఇచ్చారు. దీని వల్ల ప్రజలకు పౌష్టికరమైన ఆహారం లభించడమే కాకుండా, రైతులకు కూడా లబ్ది జరగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలెబ్ హాజరయ్యారు. జీవవైవిద్యం పట్ల విషేష కృషి చేసిన బిలాల్‌పూర్ గ్రామ మహిళా రైతు మేథరి నాగమణి, అలగోల్ గ్రామానికి చెందిన మిసనగారి ఇందిర తదితరులను సత్కరించారు.

చిత్రం..పాత పంటల జాతరను ప్రారంభిస్తున్న సబర్వాల్