రాష్ట్రీయం

సరైన పంథాతోనే శాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: విదేశీ విధానంలో సరైన పంథాను అనుసరించడం ద్వారా అన్ని దేశాల సహకారం, స్నేహపూర్వక ఒప్పందాలు, శాంతి సాధ్యమవుతుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు అభివృద్ధి వేగాన్ని పెంచుతాయని, ఇందుకోసం అన్ని దేశాలూ ఒకే తాటిమీదకు వచ్చి సమిష్టిగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి చెప్పారు. కేరళ సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ సర్వేపల్లి వెంకట శేషగిరిరావు రాసిన ‘ఇండియన్ ఓషన్ నైబర్‌హుడ్- నరేంద్రమోదీ స్ట్రాటజీ ఇనిషియేటివ్’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శేషగిరిరావు ఎంతో పరిశోధించి ఈ పుస్తకాన్ని సమగ్రంగా అందించారని చెప్పారు. భారతదేశ సముద్ర తీరానికి చుట్టూ ఉన్న దేశాలు, వాటితో సత్సంబంధాలు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ వ్యూహాలు, చేపడుతున్న చొరవ గురించి ఈ పుస్తకంలో ఉందని, భారతదేశం శాంతి కాముక దేశమే అయినా మన రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడకూడదని, మన బలాన్ని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. పురాతన కాలం నుండి సముద్ర మార్గం ద్వారా భారతదేశం వాణిజ్యాన్ని నిర్వహిస్తోందని, స్వాతంత్య్రం తర్వాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని అయితే వాణిజ్యం, రక్షణ విషయంలో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్ధికాభివృద్ధిపరంగానే కాకుండా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలతో పాటు తీర సరిహద్దుల విషయంలో భారతదేశ వ్యూహాలు, మిగతా దేశాలతో
సత్సంబంధాలు, మన భద్రతకు ప్రాధాన్యత, వనరుల పరిరక్షణ విషయంలో చేపట్టాల్సిన చర్యలు గురించి ఈ పుస్తకంలో శేషగిరిరావు వివరించారని అన్నారు. ప్రపంచ యవనికపై భారతదేశం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మన దార్శనికతకు నిదర్శనమని, ఇదే నేపథ్యంలో భారతదేశం ఉగ్రవాదం వంటి అనేక సవాళ్లను ఎదుర్కోంటోందని , తీరప్రాంత ఉగ్రవాదాన్ని సమగ్రంగా ఎదుర్కోవాలంటే భారత్ ఇతర దేశాల సహకారంతో కూడిన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని , ఆయా దేశాలకు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో సహకారాన్ని అందించాలని సూచించారు. దేశ రక్షణ, వనరుల పరిరక్షణ, వాణిజ్యం, ఉగ్రవాద సమస్యలను అధిగమించి , కీలక సమయాల్లో స్వీయ రక్షణ కోసం చేసుకుంటున్న లెమో ఒప్పందాలు వ్యూహాత్మకమని, వీటిలో సముద్ర జలాల్లో రవాణా, దొంగల బారి నుండి సరకు రక్షణ వంటివి సాధ్యమని తెలిపారు. ఇలాంటి పుస్తకాల ద్వారానే భారతదేశ నిర్ణయాల పట్ల యువతకు అవగాహన పెరుగుతుందని పరిశోధించి ఇంత మంచి పుస్తకాన్ని అందించిన శేషగిరిరావును ఆయన అభినందించారు.
మోహన్ కందాకు అభినందనలు
మాజీ ఐఎఎస్ అధికారి మోహన్‌కందా తాను రాసిన ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ - రిజల్యూషన్ ఆఫ్ డైలమాస్ పుస్తకంలోని ప్రతి అక్షరం వాస్తవమని , సివిల్ సర్వీసుల్లోకి వచ్చే యువతకు ఈ పుస్తకం దిశానిర్దేశం చేస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతికి మోహన్ కందా స్వయంగా తన పుస్తకాన్ని అందించారు. ఈ మధ్యనే తాను ఈ పుస్తకాన్ని పరిశీలించానని, పరిపాలనలో ధర్మపాలన- సందిగ్ధ సందర్భాలు సోదాహరణ పరిష్కారాలను కూడా సూచించారని, పాలనలో నీతి రీతి ఉండాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లోకి వెళ్లాలనుకునే వారు ఈ పుస్తకాన్ని తప్పనిసరి చదివి తీరాలని చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లో గురువారం కేరళ సెంట్రల్ వర్శిటీ వీసీ ప్రొ. శేషగిరిరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఎంపీ దత్తాత్రేయ తదితరులు