రాష్ట్రీయం

30 నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 7 వరకూ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేరుతో గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల నగారా ఫిబ్రవరిలో మోగే అవకాశం ఉండటంతో ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 2న సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఆరోజు ఉదయం 9.30 గంటలకు సమావేశమవుతుందని అధికారులు తెలిపారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ సహా కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
21న మంత్రివర్గ భేటీ
ముఖ్యమంత్రి దావోస్ పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. వెలగపూడి సచివాలయంలో ఆరోజు మధ్యాహ్నం 3గంటలకు ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. అంతకుముందు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.