రాష్ట్రీయం

దావోస్ పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దావోస్ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు. ఆయన స్థానంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లనున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాజధాని అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సాంకేతికతను ఉపయోగించుకుని సృష్టిస్తున్న అద్భుతాలు వివరించేందుకు ప్రతి ఏటా జనవరిలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొంటుంటారు. ఈ నెల 22 నుంచి 26 వరకూ ముఖ్యమంత్రి దావోస్‌లో పర్యటించాల్సి ఉంది. ముఖ్యమంత్రితో వెళ్లే అధికారుల బృందం, పర్యటన రోజుల సంఖ్యను కూడా కేంద్రం కత్తిరించే ప్రయత్నం చేసింది. 12 రోజుల పర్యటనను నాలుగు రోజులకు పరిమితం చేస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐదురోజులు రాష్ట్రంలో పార్టీ వర్గాలకు అందుబాటులో లేకపోతే కొంతమేర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనేందుకు వీలుగా ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దావోస్ పర్యటన విషయమై గురువారం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. వేగం గా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో పర్యటన రద్దు
చేసుకోవటం మంచిదని కొందరు మంత్రులు సూచించినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని, శ్రేణులను సమాయత్తం చేయాల్సిన కీలక సమయంలో ఆరురోజులు రాష్ట్రంలో ఉండకపోవడం సరికాదన్న కొందరు నేతల సూచనల మేరకు ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఆయన స్థానంలో దావోస్ వెళ్లనున్న మంత్రి లోకేష్ అక్కడ వివిధ సదస్సులలో మాట్లాడనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోకేష్ నేతృత్వంలో 17మంది అధికారుల బృందం కూడా దావోస్‌లో పర్యటించనుంది. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్‌కతాలో జరగనున్న ర్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం హాజరుకానున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన గురువారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జగన్‌తో కేటీఆర్ భేటీ, తదితర అంశాల పైనా చర్చించారు. మంత్రుల సలహాలు, సూచనలు తెలుసుకున్నారు.